క్రీడలు

అందరికీ నెగెటివ్‌

కరోనా నిర్ధారణ పరీక్షలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు పాస్‌

మూడో టెస్టు కోసం సిడ్నీ చేరిన జట్లు

మెల్‌బోర్న్‌: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు… క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్‌–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్‌’ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా… సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి’ అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

Comment here