క్రీడలు

టెస్టు సిరీస్‌: కేఎల్‌ రాహుల్‌ అవుట్‌

గాయపడిన కేఎల్‌ రాహుల్‌.. స్వదేశానికి పయనం

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు మరో టీమిండియా ఆటగాడు దూరమయ్యాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో శనివారం బ్యాటింగ్‌ ప్రాక్టీసు​ చేస్తున్న సమయంలో కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు.  అతడి ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. దీంతో రాహుల్‌ స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ మిగిలిన రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని పేర్కొంది. రాహుల్‌ పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని, బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో అతడు చికిత్స పొందుతాడని తెలిపింది. (చదవండిహమ్మయ్య! అందరికీ నెగెటివ్‌)

Comment here