క్రీడలు

బెట్టింగ్‌ కోసం ఏకంగా ఐపీఎల్‌ ఆటగాడికే ఫోన్‌?

న్యూఢిల్లీ: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈవెంట్‌గా పాపులర్‌ అయిన క్యాష్‌ రిచ్‌ టోర్నీ ఐపీఎల్‌‌ అదే స్థాయిలో వివాదాలకు కేంద్రంగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు అజిత్‌ చండీలా, శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌ బెట్టింగ్‌ ఆరోపణలతో నిషేదానికి గురికాగా, తాజాగా మరోసారి బెట్టింగ్‌కు సంబంధించిన విషయమొకటి వెలుగు చూసింది. ఐపీఎల్‌లో బెట్టింగ్‌ ఎలా పెట్టాలి? ఏ జట్టుపై డబ్బులు పెడితే బాగుటుంది, అంతర్గతంగా టీమ్‌ విషయాలు తెలపాలంటూ ఢిల్లీకి చెందిన ఓ నర్స్‌ ఐపీఎల్‌ ఆటగాడిని సంప్రదించినట్టు ఓ స్టడీ రిపోర్టు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ధ్రువీకరించారు.

Comment here