జాతీయం అంతర్జాతీయం

డయాలసిస్‌ పేషెంట్లకు ఆక్స్‌ఫర్డ్‌ టీకా

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా కలిసి తయారు చేసిన కోవిడ్‌–19 టీకా వ్యాక్సినేషన్‌ ప్రపంచంలోనే ప్రప్రథమంగా సోమవారం యూకేలో మొదలైంది. డయాలసిస్‌ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో డయాలసిస్‌ రోగి బ్రియాన్‌ పింకెర్‌(82)కు మొదటగా టీకా వేశారు. టీకా తయారీలో కీలక పాత్ర పోషించిన ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ కూడా మొదటగా టీకా తీసుకున్న వారిలో ఉన్నారు.

Comment here