జాతీయం అంతర్జాతీయం

“మోల్నుపిరావిర్ ఒక్కరోజులోనే దేహంలోని వైరస్ ను చంపేస్తుందట

“మోల్నుపిరావిర్ “… ప్రస్తుతం ఈ పదం డ్రగ్ ప్రపంచంలో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యముగా కోవిద్ తో అల్లాడుతున్న దేశాలలో ఈ డ్రగ్ గురించి తెలుసుకొని ఊపిరి పీల్చుకొంటున్నారు కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచం మీద దండయాత్ర చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో కేసులతో ప్రభుత్వాలకు దిక్కుతోచని విధంగా హడలెత్తిస్తోంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. వ్యాక్సిన్ రానే వచ్చింది.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగానే సాగుతుంది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆర్ధిక చేయూతనిస్తున్న కేంద్రం కొత్త వ్యాక్సిన్లకు అనుమతినిచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

అయితే వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా బారిన పడుతుండడంతో ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా అసలు వైరస్ ను చంపే మందే లేదా అని మళ్ళీ ఎదురుచూపులే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలోని జార్జియా స్టేట్​యూనివర్శిటీ పరిశోధకులు ఓ శుభవార్త చెప్పారు. అదేమంటే కరోనాను చంపే టాబ్లెట్ తయారుచేస్తున్నామని.. ఇది ఒక్కరోజులోనే వైరస్ ను చంపేస్తుందని ప్రకటించారు. వీళ్ళు తయారుచేసిన మోల్నుపిరావిర్ (Molnupiravir) అనే యాంటీ వైరల్ టాబ్లెట్ కరోనా సోకిన దేహానికి ఇస్తే అది ఒక్కరోజులోనే దేహంలోని వైరస్ ను చంపేస్తుందట. ఇప్పటి వరకు కరోనాను ఎదుర్కొనే టాబ్లెట్ లేకపోగా ఇదే మొట్టమొదటిదని డ్రగ్ పరిశ్రమలో గట్టిగ వినిపిస్తోంది. ఇప్పటికే దీనిపై మన వాళ్ళు ప్రయోగాలు మొదలు పెట్టేశారట.