బిజినెస్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆద్వర్యంలో CNG బంకులు


విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో 10 వరకూ ఏర్పాటు
పెరుగుతున్న cng వాహనాల సంఖ్య
ఇప్పటికే ఆటోలు, స్కూలు బస్సులు cng తో సంచారం
భారత్ వాయిస్, విశాఖపట్నం : ఐటీ ఉద్యోగి కనకరాజు ఒక కారు కొనుక్కోవాలనేది ఆయన గాఢమైన కోరిక. అయితే తనకు వస్తున్న జీతం, నెలకు అవబోయే పెట్రోలు ఖర్చులను బేరీజు వేసుకొని తన కోరికను అణుచుకున్నాడు. దీనికి కారణం రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోలు ధరలే. అయితే LPG gas నడిచే కార్లు కొనుక్కుందామనుకుంటే అవి పేలిపోతున్నాయనే వార్తలు ఆయన్ని భయపెట్టేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎంతో సురక్షితమైన compressed natural gas (cng) కార్లు పై అతని దృష్టి మరలింది. డబ్బులు ఎక్కువైనా అవే కొనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. దానికి కారణం పెట్రోల్ తో పోలిస్తే cng ధర తక్కువ కావడంతో పాటు మంచి మైలేజీ కూడా ఇవ్వడమే. అయితే అతని ఉత్సాహంపై తోటి ఉద్యోగస్తులు నీళ్లు చల్లేసారు. కారణం cng గ్యాస్ పంపు స్టేషన్లు లేవనేది వారి అభిప్రాయం. . అయితే ఇది చాలా తప్పు విశాఖపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఈ గ్యాస్ బంకులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆద్వర్యంలో నడిచే బంకుల్లో ఈ cng గ్యాస్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలను అందించాలనే ప్రధాన ఉద్దేశమే ఈ వ్యాసం తాలూకా ప్రధాన ఉద్దేశం. వివరాల్లోకి వెళ్తే…..
లీటరు పెట్రోలుతో కార్ల రకాలను బట్టి 10 నుంచి 20 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. అదే డీజిల్ తో మరో 5 లేదా 6 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించవచ్చు. అదే cng తో అయితే మరో 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించవచ్చు. ఈ కారణంగానే ఇటీవల కాలంలో cng వాహనాల పట్ల ప్రజలు కూడా మక్కువ చూపిస్తున్నారు. అయితే గ్యా తో నడిచే వాహనాలు ప్రమాదకరమనే భావన ఉండటంతో వాటి కొనుగోళ్లకు జనాలు వెనకడుగు వేస్తున్నారు. . అయితే గతంతో పోలిస్తే మారిన టెక్నాలజీ కారణంగా ఎల్పీజీ స్థానంలో cng సిలిండర్లు కలిగిన వాహనాలు రావడంతో జనాల దృష్టి మళ్లీ gas తో నడిచే వాహనాల వైపు మళ్లింది. అయితే cng గ్యాస్ పంపులు ఏయే ప్రాంతాల్లో అందుబాటులో ఉందనే విషయం పెద్దగా తెలియకపోవడం కారణంగా వాటి అమ్మకాలు జోరందుకోలేదు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో దాదాపు 10 వరకూ సిఎజ్ గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. విశాఖ , అనకాపల్లి జిల్లాలో కలుపుకొని మొత్తం 10 cng, పెట్రోలు బంకులు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే… శివజ్యోతి (మద్దిలపాలెం), రవిరేస్(స్టీల్ ప్లాంట్), ఎస్వీఎస్ఎస్ (లంకెలపాలెం), సత్యమాంబ (కొత్తూరు, అనకాపల్లి), శ్రీదేవి ప్రసాద్ ఏజెన్సీస్( తాళ్లపాలెం, కసింకోట), గాయత్రి కోకో (వేంపాడు), శ్రీదేవి ప్రసాద్ సర్వీసెస్ (నామవరం), వీరాంజనేయ రోడ్ సర్వీసెస్ (ఎస్.
రాయవరం), వికెఆర్. పెట్రో పాయింట్ (రేబాక), శివరామ (అనకాపల్లి) తదితర ప్రాంతాల్లో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో విశాఖ నగరంలోని బిర్లా జంక్షన్ దరి, మల్కాపురం ప్రాంతంలోనూ కొత్తగా గ్యాస్ పంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.cng బంకులు పెరుగుతుండటంతో విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో gas తో నడిచే ఆటోలు, స్కూలు బస్సుల సంఖ్య పెరుగుతోంది. మున్ముంది cng వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీద పరుగులు తీస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.