వార్తలు

ఇకపై జరీమానాలే

 

(భారత్ వాయిస్, విశాఖపట్నం ) :ఈనెల 20వ తేదీ నుంచి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు వాహనాల పై ఉండే నెంబర్ ప్లేట్ల పై దృష్టి సారించనున్నారు. ఆర్టిఏ నిబంధనలకు అనుగుణంగా నెంబర్ ప్లేట్లు ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా వెయ్యి రూపాయల జరిమానా విధించ నున్నారు . నెంబర్ ప్లేట్ లో ఏ విధమైన రాతలు ఉండకూడదు. అలాగే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల నే వాడాలి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనము సీజ్ చేసి జరిమానా చెల్లించిన పిదప వాహనాన్ని వదలడం జరుగుతుందని ఆర్టిఏ విశాఖపట్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు.