భారత్ వాయిస్, విశాఖపట్నం 21 సెప్టెంబర్ 2021 :
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం మరియు ఎనర్జీ (ఐఐపిఇ), విశాఖపట్నం సంస్ధ తమ ఆరవ వ్యవస్ధాపక దినోత్సవ సంబరాలను 20-10-2021న జరుపుకున్నది. ఐఐపిఇ జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్ధ. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (రీ ఆర్గనైజేషన్) చట్టం నియమావళి ప్రకారం పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వశాఖ వారి పరిధిలో 2016వ సంవత్సరములో భారత ప్రభుత్వం వారిచే ఐఐపిఇ స్ధాపించబడినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఇవ్వబడిన స్ధలంలో వంగలిగ్రామం, సబ్బవరం మండలం, విశాఖపట్నం వద్ద తమ శాశ్వత భవనం ప్రాంగణం నిర్మాణంనకు 20-10-2016న శంకు స్ధాపన (పునాది) చేసిన దినోత్సవంనకు గుర్తుగా ఈ వేడుక నిర్వహించారు.
ఈ వేడుకలో ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాష్ వైస్ ఛాన్సలర్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ, విశాఖపట్నం మరియు శ్రీ వి. రతన్‌రాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెచ్‌పిసిఎల్, విశాఖ రిఫైనరీ వారు ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు.డాక్టర్ ప్రతిభ బిస్వాల్, విద్యార్ధుల వ్యవహారాల, అసోసియేటెడ్ డీన్ వర్చువల్‌గా చేరిన విద్యార్ధులు అందరికీ స్వాగతం పలికగా 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని కుమారి సుభద్ర ఆహ్వానితులకు స్వాగతం పలికారు. ఈ వేడుక సందర్భంగా ఐఐపిఇ న్యూస్ లెటర్‌ను ‘‘ ఫోర్త్ ఎస్టేట్’’ పేరిట ‘‘మెటమార్ఫోసిస్’’ శీర్షికతో వెలువరించారు.
ఈ సందర్బంగా ప్రొఫెసర్ విఎస్ఆర్కె ప్రసాద్, డైరెక్టర్ ఐఐపిఇ వారు సభికులనుద్దేశించి ప్రసంగించారు. ఐఐపిఇ స్ధాపన నుండి సంస్ధ ప్రస్తావనంను వివరించారు. స్ధాపించిన 5 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే సంస్ధ ఉత్తమ బోధనకు మరియు పరిశోధనాత్మక ప్రక్రియలకు విశేష గుర్తింపును పొందినట్లు ఆయన వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రాంగణ ఎంపికలు (ప్లేస్‌మెంట్స్) బాగా వృద్ధి చెందినట్లు మరియు భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు. ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ సిహెచ్ గుప్త చందలూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు విద్యార్దుల సమన్వయ కర్తలను ఫోర్త్ ఎస్టేట్ సమర్పించినందుకు ఆయన అభినందించారు.
ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాష్, వైస్ ఛాన్సలర్ విద్యార్దులనుద్దేశించి ప్రసంగించారు మరియు పోటీ పడే మనస్తత్వం అలవరచుకోవాలని మరియు తమ లక్ష్య సాధనపై దృష్టి సారించాలని అభ్యర్ధించారు. డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మరియు శ్రీ దామోదరం సంజీవయ్య వంటి గొప్ప వ్యక్తుల వాస్తవిక జీవిత గాధలు స్పూర్తిని పొందాలని, జీవితంలో విశ్వసనీయత మరియు సమగ్రత సూత్రాలను విద్యార్ధులు అలవరచుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా శ్రీ వి.రతన్‌రాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విశాఖ రిఫైనరీ వారు మాట్లాడుతూ చమురు మరియు ఇంధన రంగాలలో నూతన ఆవిష్కరణల ఆవశ్యకతను విద్యార్ధులు గుర్తించాలని అన్నారు. సాంప్రదాయేతర Ê పునరుత్పాదక ఇంధనములు మరియు గ్రీన్ హైడ్రోజన్ వగైరా వంటి కార్బన్`న్యూట్రల్ సింథటిక్ ఇంధనముల రంగాలలో పరిశోధనలపై విద్యార్ధులు మరియు ఫ్యాకల్టీ దృష్టి పెట్టవలసినదిగా సూచించారు. హెచ్.పి.సి.ఎల్. అన్ని రంగాలలో ఐఐపిఇ సంస్ధకు తమవంతు సహకారం మరియు మార్గదర్శకత అందిస్తుందని ఆయన చెప్పారు.
గడచిన విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్దులకు ఈ సందర్భంగా నగదు పురస్కారాలు అందజేసారు. చివరగా డాక్టర్ బి.మురళికృష్ణ, రిజిష్ట్రార్ (ఐ/సి) హాజరైన ప్రత్యేక అతిధులకు ఫ్యాకల్టీ, సిబ్బంది, విద్యార్దులు అందరికీ విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.