వార్తలు

కాలానుగుణంగా వృత్తి నైపుణ్యం పెంచుకుంటాం

పోలీస్‌ డ్యూటీ మీట్‌లో డీజీపీ

సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో వృత్తిపరమైన నైపుణ్యం పెంచుకుంటామని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ తొలిరోజు ప్రారంభ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ తొలి డ్యూటీ మీట్‌ పోలీస్‌ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, 15 ఏళ్ల తర్వాత తిరుపతిలో రెండవ సారి నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆరేళ్లుగా డ్యూటీ మీట్‌ నిర్వహించలేదన్నారు. ఇక నుంచి ఏటా దీన్ని నిర్వహించుకుంటామని చెప్పారు.

Comment here