వార్తలు

క్రీడాకారుల కోసం “జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్

భారత్ వాయిస్, విశాఖపట్నం : రాష్ట్రంలోని క్రీడాకారులను గుర్తించి వారికి మంచి ప్రోత్సాహం అందించేందుకుగానూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుం బిగించారు. అందులో భాగంగా గురువారం ” జగనన్న స్పోర్ట్స్ క్లబ్ ” అనే యాపను క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా , శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురువారం ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులు అందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి అర్హతలను గమనించి, వారికి మంచి ప్రోత్సాహం ఇచ్చేందుకుగానూ సిఎం జగన్ ఈ బృహత్తరమైన నిర్ణయం తీసుకోవడం క్రీడాకారులకు గోల్డెన్ పిరియడ్ ప్రారంభమైనట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. క్రికెట్, చెస్, టెన్నిస్ తో పాటు పలు క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు తమ పేర్లను యాప్ లో ఇవ్వబడిన పలు క్ల బ్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు. రాయలసీమ బాడ్మింటన్ క్లబ్, హనుమాన్ స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లు, చెస్ విలేజ్ క్లబ్, కబడ్డీ పల్నాడు స్పోర్ట్స్ క్లబ్, చెస్ స్కూల్ క్లబ్, వాలీబాల్ వైఎస్ఆర్ కోనంగి యూత్, అథ్లెటిక్స్ క్లబ్ బొగ్గారం, ఖోఖో బొగ్గారం ఖోఖో క్లబ్, సతీష్ కుమార్ ఫుట్ బాల్ క్లబ్, షటిల్ బాడ్మింటన్ భద్ర యూత్ క్లబ్ ఉన్నాయి.