వార్తలు

క్లోవ్ టెక్నాలజీస్ రక్తదాన శిబిరం

(భారత్ వాయిస్, విశాఖపట్నం): క్లోవ్ టెక్నాలజీస్ 17 వ వార్షికోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ వాల్టేర్ సహకారంతో క్లోవ్ టెక్నాలజీస్ వారు నేడు మధురవాడలో గల ప్లాట్ నెంబర్ 9, హిల్ నెంబర్ 2, ఎపిఐఐసి ఐటి, రుషికొండ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిభిరాన్ని క్లోవ్ టెక్నాలజీస్ ఎండి శ్రీ వర్మ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వర్మగారు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రక్తం అవసరం పెరిగినందున, మేము క్రమం తప్పకుండా రక్తదాన శిభిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వాల్టేర్ అధ్యక్షులు శ్రీ ఎస్. ఎన్. స్వామి గారు, కార్యదర్శి శ్రీ కె. ఎస్. ఆర్. కె. రాజు (సాయి), రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ జి.ఎస్. రాజు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా 60 యూనిట్ల రక్తాన్ని సేకరించామని నిర్వాహకులు తెలిపారు. నిరుపేదల కోసం రక్తదానం చేసిన వ్యక్తులకు కృతఙ్ఞతలు తెలిపారు