వార్తలు

గిరిజనాభివృద్ధి కి అంకిత భావంతో కృషి చేస్తా

రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ డా. కుంభా రవిబాబు

భారత్ వాయిస్, అరకువ్యాలీ అక్టోబర్ 21:
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు అన్నారు. గురువారం ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు,వ్యవసాయ శాఖ, ఎంపిడిఓ లు తహసీల్దార్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు ప్రాధమిక సౌకర్యాలు కల్పించి ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించారు. గిరిజన ఆర్ధిక వ్యవస్థ, గిరిజన విద్య, వైద్యం, గిరిజన నిరుద్యోగ యువకులలో మార్పు రావాలని అన్నారు. ఏజెన్సీలోని కాఫీ, పసుపు,వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు.మన్యంలో మినీ రిజర్వాయర్ లు నిర్మాణానికి ఆలోచన చేయాలన్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధి లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. మన్యంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. కాఫీ,ట్రైకార్, మనబడి నేడు పనులు వివరించారు.30 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో నాడు నేడు పనులు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వి.అభిషేక్, ఐటీడీఏ ఎపిఓ వి ఎస్ ప్రభాకర్గిరిజన సంక్షేమశాఖ డిడి జి.విజయ కుమార్,వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.