వార్తలు

గిరిజన నిరుద్యోగ యువతకు “స్ఫూర్తి”

(భారత్ వాయిస్, విశాఖపట్నం ) : విశాఖపట్నం జిల్లా పోలీసులు రూపొంధించిన “స్ఫూర్తి” కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ వ్యాప్తంగా మావోయిస్ట్ ప్రభావిత మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులలో చదువుకున్న నిరుద్యోగ యువతకు జిల్లా పోలీసులు అప్పటి ఎస్.పి., శ్రీ బాబూజీ అట్టాడ ఐ.పి.ఎస్., మరియు ఐ.టి.డి.ఏ., పి.వో., శ్రీ బాలాజీ ఐ.ఏ.ఎస్., లు ప్రత్యేకించి వీరికి తగిన శిక్షణ ఇస్తే ఉద్యోగ అవకాశాలు పొందుతారని భావించి ఐటిడిఏ పాడేరు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యుట్ వారితో సంయుక్తంగా ఒక ప్రవేశ పరీక్ష పెట్టగా దానికి మొత్తం 1500 మంది పరీక్ష వ్రాయగా వారిలో 484 మంది గిరిజన యువతను ఎంపిక చేసి గత సంవత్సరం పాడేరు, విశాఖపట్నం వైటిసి సెంటర్ల లో వీరికి శిక్షణ అందించారు. దీనికి వివిధ సబ్జెక్టులను బోధించడానికి నిష్ణాతులైన ఉపాధ్యాయులను వివిధ ప్రాంతాల నుంచి పిలిపించి చెప్పించారు. ఇండోర్, ఔట్ డోర్ మరియు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 2019 న జరిగిన ఎస్.ఎస్.సి., (Staff Selection Commission), నిర్వహించిన పోటీ పరీక్షలలో వీరందరూ పోటీపడి వివిధ విభాగాలలో తమ ప్రతిభను కనబరిచి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ నుంచి మొత్తం 32 మంది దేశ పారామిలిటరీ విభాగాలలో ఎంపీకయ్యారు వారిలో నలుగురు మహిళలు ఉండడం విశేషం. శిక్షణకు వెళ్ళుచున్న వీరిని ఉద్దేశించి శ్రీ ఎస్.సతీష్ కుమార్ ఐ.పి.ఎస్., మాట్లాడుతూ పారామిలిటరీలలో సర్విస్ చేయడం దేశానికి సేవచేయడము, దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలను చూసే అవకాశం ఉంటుంది మిగతా ఏ ఉద్యోగంలో కూడా ఇలాంటి అవకాశం ఉండదని, కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నామని భావించకుండ కొత్త కొత్త ప్రదేశాలను చూసే అవకాశాన్ని అంధిపుచ్చు కోవాలని జిల్లాకు, దేశానికి మంచిపేరు తేవాలని అన్నారు. శ్రీ గెమ్మిళి భారత్ కుమార్, పాడేరు మాట్లాడుతూ తాను బి.ఎస్.ఎఫ్,కు ఎంపికయ్యానని, తాను ఈ ఉద్యోగం సాధించడము తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. జిల్లా పోలీసులు తమ భవితకు మంచి దిశానిర్దేశం చేయడం, శిక్షణ కాలంలో మా వెన్నంటే ఉంటూ మేము నిద్రించిన తరువాత వారు నిద్రకు ఉపక్రమించేవారు, వారి అహర్నిశల శ్రమ మావిజయనికి కారకులయ్యారని జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంధర్భంగా వీరంధరు తాము సాధించుకున్న ఉద్యోగాలకు సంభంధించిన శిక్షణ నిమిత్తం వెళ్ళుచున్న సంధర్భంగా జిల్లా ఎస్.పి., శ్రీ బి.కృష్ణారావు ఐ.పి.ఎస్., వీరందరిని ఈ రోజు తమ కార్యాలయంలో కలిశారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్.పి., మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలోని గిరిజన యువత కష్టపడే గుణం, మనస్తత్వం ఉండడం వలన వీరిలో వాలీబాల్ క్రీడాకారులు జాతీయ జట్టుకు ఆడుతూ ఉండడం అలాగే వివిధ క్రీడల్లో వీరికి మంచి ప్రావీణ్యం ఉందని అన్నారు. ఇలాంటి వారిని సరైన మార్గంలో ధిశ నిర్దేశం చేస్తే పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారనే, నమ్మకం కలగడం అందుకు అనుగుణంగా జిల్లా పోలీసులు స్ఫూర్తి కార్యక్రమం ఐటిడిఎ పిఓ వారి సహకారంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు మిగతా పోటీ పరీక్షలకు శిక్షణ అంధించారు. లక్షల మంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతారు. భారతదేశం మొత్తం 741 జిల్లాలు ఉండగా విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి గిరిజన యువత ఈ పోటీ పరీక్షలు ఎదుర్కొని 32 మంది ఉద్యోగాలు పొందడం చాలా సంతోషంగా ఉందని, జిల్లా పోలీసుల శ్రమ ఫలించిందని అన్నారు. ఉద్యోగాలకు సంభంధించిన శిక్షణ నిమిత్తం వెళ్ళుచున్న గిరిజన యువతకు జిల్లా ఎస్.పి., శుభాకాంక్షలు తెలుపుతూ వారికి “స్ఫూర్తి” జ్ఞాపికలను అంధజేశారు. అలాగే “స్ఫూర్తి” కార్యక్రమానికి ముందునుంచి శ్రమించిన స్థానిక పాడేరు డి.ఎస్.పి., డా.వి.బి.రాజ్ కమల్ – కమ్యూనిటి పోలిసింగ్ ఇన్స్పెక్టర్ శ్ర్రీ ఎన్.సాయి., తదితరుల సేవలను జిల్లా ఎస్.పి., కొనియాడారు.ఈ కార్యక్రమములో శ్రీ ఏ.వెంకట రావు, ఇన్స్పెక్టర్ ఎస్.బి., – శ్రీ జి.డి.బాబు, ఇన్స్పెక్టర్, జి.మాడుగుల మరియు ఎస్.ఐ లు శేఖరం, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.