వార్తలు

గోపాలమిత్ర జీవితాలు అచమ్యగోచరం

భారత్ వాయిస్, విశాఖపట్నం :
అనకాపల్లి….పశుసంవర్ధక శాఖలో గౌరవ వేతనం పుచ్చుకుంటూ పని చేస్తున్న గోపాలమిత్ర జీవితాలు ఆచమ్య గోచరంగా తయారయ్యాయని రాష్ట్ర యూనియన్ నాయకులు కిల్లాడ వెంకటరమణ తెలియజేశారు. ఆదివారం స్థానిక సీ ఐ టి యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా గోపాలమిత్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వం ఆదుకుని గోపాల మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కొన్ని నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు, దూడలు పుట్టినందుకు ఇవ్వవలసిన ప్రోత్సాహకాలను ఇప్పటివరకు ఇవ్వకపోవడం దురదృష్టమని దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. 6500రూ. లతో కుటుంబాన్ని నెట్టుకురావటం చాలా కష్టంగా ఉందని అన్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గోపాల మిత్ర లకు న్యాయం చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వరం ఇచ్చినప్పటికీ అధికారులు ఇప్పటి వరకూ స్పందించలేదని అధికారుల తప్పిదం వల్లనే గోపాల మిత్రులకు న్యాయం జరగలేదని అన్నారు ఎన్నో ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పాడి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, పాడి రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు, పశు దాణా పశుగ్రాసాలు వంటివి రైతుకు చేరవేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతున్న గోపాల మిత్రులను గుర్తించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి గోపాల మిత్రులను ఆదుకోవాలన్నారు లేనిపక్షంలో రైతు భరోసా కేంద్రం లో నిర్వహించే విధులకు హాజరు అవ్వమని రైతు భరోసా కేంద్రం లో పనిచేస్తున్న ఆహా ల తో పాటు తమకు సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆర్ బి కే లలో పనిచేస్తున్న ఆహా లు కంటే ఎక్కువశాతం రైతులకు సేవలు అందించేది గోపాలమిత్ర లేనని 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్న తమకు ఆర్ బి కే లలో అవకాశం కల్పించాలని కోరారు. ఆఫీస్ సబార్డినేట్ లాగా తీసుకుంటామని గతంలో ఇచ్చిన మాటకు నేటికీ ఆ మాటకు అతీగతి లేదని ఇప్పటికైనా గోపాలమిత్ర లను గుర్తించి తమ జీవితాలకు భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లు రైతు సంఘం నాయకులు జిల్లా అన్ని మండలాల నుండి గోపాలమిత్ర లు పాల్గొన్నారు