వార్తలు

ఘనంగా రోటరీ మీన్సు బిజినెస్ సంస్థ విశాఖపట్టణం రెండవ వార్షికోత్సవ వేడుకలు

విశాఖపట్నం: రోటరీ మీన్సు బిజినెస్ సంస్థ విశాఖపట్టణం రెండవ వార్షికోత్సవ వేడుకలు ఈ రోజు హోటల్ మేఘాలయ లో ఘణంగా జరిగాయని. అధ్యక్షుడు సునీల్ చౌదరీ తెలియశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్సి లలిత్ జైన్ , కోశాధికారి రంజిత మరియు రోటరియన్ రాథోడ్ తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త సీనియర్ రోటేరియన్ కంటిపూడి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య వక్త గా విచ్చేసిన పూర్వ రోటరీ జిల్లా-3020 గవర్నర్ జి. విశ్వనాధ్
రోటరీ నిర్దేసించిన నాలుగు మార్గాల సందేశాన్ని అందరు రోటేరియన్లు తెలుసుకోవాలి మరియు పాటించాలి. “మనం ఆలోచించే , మాట్లాడే చేసే పనులలో మొదటిది: అది సత్యమేనా? రెండవది: ఇది సంభందిత వ్యక్తులందరికి న్యాయం చేసేదేనా? మూడవది ఇది సుహృద్భావాన్ని మరియు మెరుగైన సంబంధాలను నిర్మిస్తుందా? మరియు నాలుగవది ఇది సంభందిత వ్యక్తులందరికి ప్రయోజనకరంగా ఉంటుందా ? అనే విధానాలను అవలంబిస్తూ పరస్పర ప్రేమ సేవ భావంతో వ్వవహరిస్తే ఏ వ్యవస్థ అయిన పురోగతి పొందవచ్చు అని జూమ్‌ మాధ్యమం ద్వారా ముఖ్యఅతిధి సభ్యులను ఉద్దేసించి ప్రసంగించారు.