వార్తలు

ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

( భారత్ వాయిస్, విశాఖపట్నం ) :
విశాఖపట్నం బ్రాంచ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో శ్రీమతి సుమిదా దేవి , ఐ.ఆర్.ఎస్ అడిషనల్ డైరెక్టర్ , నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , ఇండైరెక్ట్ టాక్సెస్, మరియు నార్కోటిక్స్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఆమె మహిళా ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ని ఉద్దేశించి నేటి సమాజం లో మహిళల పాత్ర మరియు ఫైనాన్స్ రంగం లో వారి ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమములో స్పీకర్లుగా సిఏ. రీతూ అగర్వాల్ మరియు సిఏ. వీణా అగర్వాల్ సభ్యులని ఉద్దేశించి డ్యూ డేట్స్ ఫర్ 31 మార్చ్ అనే అంశం పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిఏ. ఎస్. మురళీ కృష్ణ, ఉపాధ్యక్షులు సిఏ. వాసుదేవ మూర్తి , కార్యదర్శి సిఏ. ప్రశాంత్ కుమార్, ఎడిటర్ మరియు పూర్వ అధ్యక్షులు సీఏ. భారతి దేవి పాల్గొన్నారు. సదస్సు లో మొత్తం 60 మంది సిఏ మహిళా సభ్యులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు .