వార్తలు

జర్నలిస్ట్ బస్సు పాసులు రెన్యువల్ చేయాలి : నర్సీపట్నం, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్

(భారత్ వాయిస్, నర్సీపట్నం..మార్చ్ 17) :
ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ కార్డులు కొత్తవి ఇవ్వకపోగా, పాతవి రెన్యువల్ చేయకపోవడం దారుణమని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్సి యలమంచిలి వేణు ఆవేదన వ్యక్తం చేశారు. జాప్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం జర్నలిస్టులు ధర్నా నినాదాలు చేశారు అనంతరం ఆర్డీవో కార్యాలయ పరిపాలనాఅధికారి వై.ఎస్.వి.వి. ప్రసాదరావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వేణు మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య దోరణిని తీవ్రంగా ఖండించారు. కోర్టు కేసులు సాకుగా చూపించి అక్రిడిటేషన్ కార్డులు నిలిపివేయడం బాధాకరం అన్నారు కోర్ట్ కేసులు తేలే వరకూ పాతకార్డులు రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పధకాలు ప్రచారంలో కీలకంగా వ్యవహరించే జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు జాప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ,నర్సీపట్నం ప్రెస్ క్లబ్ కార్యదర్శి జె.శ్రీధర్ గౌరవ అధ్యక్షులు వర్రే రమణ,ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షుడు ఎం.అప్పలరాజు, ఎలెక్ట్రానిక్ మీడియా కార్యదర్శి లంక శివకుమార్, కె.మాణిక్యాలరావు, పి.మురళి, ఈనాడు కోటి,పి.గోవిందు, డి.వి.రమణతో పాటు మాకవరపాలెం నాతవరం మండలాలకు సంబంధించిన పలువురు జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.