వార్తలు

డ్రైవింగ్ శిక్షణలో ” మారుతి స్కూల్ ‘ కి సరిలేరు

 దేశవ్యాప్తంగా ఎన్నో వేలమందికి అభయహస్తం

 సుశిక్షితులైన ట్రైనింగ్ సిబ్బంది సొంతం

 భద్రతతో కూడిని ప్రయాణానికి “మారుతి” యే చిరునామా

భారత్ వాయిస్, విశాఖపట్నం :

                       ఐటీ ఉద్యోగి కనకరావుకు కారు కొనుక్కోవాలని అనిపించింది. డ్రైవింగు రాకపోవడంతో ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక డ్రైవింగ్ స్కూల్ లో చేరాడు. అక్కడ నేర్చుకున్నామన్న ఉత్సాహంతో ఒక కొత్త కారు కొన్నాడు. ఇంటికీ ఆఫీసుకీ తిరిగిన పక్షం రోజుల్లోనే అనేక చోట్ల ప్రమాదాలకు గురయ్యాడు. ముందు వెనుక సొట్టలు పడి కొత్త కారు కాస్త వర్షంలో తడిసిన పెళ్లికూతురిలో తయారైంది. దీనంతటికీ కారణం కారు డ్రైవింగ్ లో తగినంత శిక్షణ లభించక పోవడమేనన్న చేదు నిజాన్ని తెలుసుకున్నాడు. స్నేహితుల సలహా మేరకు వరుణ్ మోటార్స్ ఆద్వర్యంలో నడిచే మారుతి డ్రైవింగ్ స్కూల్ లో 21 రోజుల పాటు శిక్షణ పొందాడు. ఇప్పుడు గంపెడంత గుండె ధైర్యంతో కారు నడిపేస్తున్నాడు. ఇలాంటి కనకారావులు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు. తక్కువ ఫీజులతోనే కారు డ్రైవింగ్ నేర్చుకోవచ్చనే ఆశతో ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందడం, ప్రమాదాలను కోరి తెచ్చుకోవడం చూస్తున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న అనేక ప్రమాదాలను చూస్తుంటే డ్రైవింగ్ నేర్చుకోడానికే భయమేస్తుంది. అలాంటి వారందరికీ మేము ఉన్నామంటుంది వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్.

                       ఇక ఈ స్కూల్ విషయానికి వస్తే… దేశంలో అనేక కార్ల కంపెనీలు ఉన్నాయి. అనేకమంది వాహన డీలర్లు ఉన్నారు. వీరికి కార్ల అమ్మకాల పైనే ధ్యాసే. అయితే వరుణ్ మోటార్స్ రూటే సెపరేటు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవింగ్ లో సరైన శిక్షణ లేకపోవడమేనన్న విషయాన్ని గ్రహించింది. ఈ లోటును సరిదిద్దాలనుకుంది. అందులో భాగంగానే ” మారుతి డ్రైవింగ్ స్కూల్ ”ను ఏర్పాటు చేసింది. ఆ స్కూల్ లో డ్రైవింగ్ నేర్పేందుకు చేరే ఉద్యోగులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చింది. వారి ద్వారానే దేశంలో తనకున్న డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా అనేక వేల మందికి శిక్షణ ఇస్తోంది. 

                       వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్ లో ఇచ్చే ఇరవై ఒక్క రోజుల శిక్షణ నాలుగు విధాలుగా ఉంటుంది. అందులో మొదటిది ధియరీ సెషన్. ఈ సెషన్ లో వాహనంలోని ప్రధాన భాగాలు ఏంటి. వాటిని ఉపయోగించుకొని మనం సురక్షితంగా డ్రైవింగ్ ఎలా చేయాలి. రోడ్డు సిగ్నల్స్ పాటించాల్సిన విధానం, ఇతర వాహనాల విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి మొదలగువన్నీ బోధిస్తారు. ఇక రెండవది డెమో సెషన్. ఈ సెషన్లో కారు ఇంజన్ భాగాల పనితీరు. వాటి నిర్వహణ, వాహనం నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొనాలి వన్నీ చెబుతారు. అలాగే కారు లోపల ఉండే సదుపాయాలతో ఏయే విషయాలను గ్రహించవచ్చనేది పేర్కొంటారు. ఈ రెండు సెషన్లతో కారు గురించి కొంత అవగాహన వచ్చేస్తుంది.

                       ఇక మూడోది సిమ్యులేటర్ సెషన్ . కారు మాదిరిగా చక్రాలు లేని వాహనమనే చెప్పాలి. ఇందులో స్టీరింగు, ఏక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఇలా… సాధారణ కారులో ఉండే ప్రతీది ఈ డమ్మీ కారులో ఉంటుంది. స్టీరింగుకు అవతల ఉండే మూడు మానిటర్ సహాయంతో ఒక కృత్రిమ రోడ్డును సృష్టిస్తారు. రాత్రి, పగలు, వర్షం, మంచు తదితర వాతావరణ పరిస్థితుల్లో కారును ఎలా డ్రైవ్ చేయాలనేది ఇందులో నేర్పిస్తారు. ఎత్తైన ఘాటు రోడ్డు మీద వాహనాన్ని ఎలా నడపాలనేది కూడా నేర్పిస్తారు. రోడ్లపై ట్రాఫిక్ లేని సమయంలోనూ, రద్దీ సమయాల్లో ఎలా నడపాలో కూడా సిమ్యులేటర్ సహాయంతో నేర్పిస్తారు. ఈ సిమ్ములేటర్ సెషన్ పూర్తయితే చాలు రోడ్ల మీదకి కారును ఎంత తొందరగా డ్రైవ్ చేద్దామా అనే మనోధైర్యం మనలో కలుగుతుంది. సిమ్యులేటర్లో నేర్చుకునే వారి సామర్థ్యాన్ని బట్టి శిక్షకులు నిజమైన కారు స్టీరింగ్ సీటులో కూర్చోబెట్టి రోడ్డు మీదకు వస్తారు.

                      ఇక్కడితో అసలైన ప్రాక్టికల్ సెషన్ మొదలవుతుంది. సిమ్యులేటర్ మీద నేర్చుకున్న అనుభవాన్ని రంగరించి రోడ్డు మీద నేర్చుకునేవారు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ పూర్తి స్థాయి డ్రైవర్ గా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాక్టికల్ సెషన్లో క్లచ్ కంట్రోల్ 3, 4, 5 గేర్లు వేసే విధానం, యు టర్న్ తీసుకోవడం, పెద్ద రోడ్ల నుంచి చిన్న రోడ్లకు టర్నింగ్ తీసుకోవడం అలాగే చిన్న రోడ్ల నుంచి పెద్ద రోడ్ల మీదకి రావడం, కొండ ప్రాంతాల రోడ్ల మీదకి తీసుకువెళ్లడం కిందకు తీసుకురావడం, పారలల్, ఏంగ్యులర్ పార్కింగ్ స్లో వాహనాన్ని నిలపడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ మొదలగు అంశాలన్నీ రోజుకి ఒక్కో గంట చొప్పున నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పించి చేతులు దులిపేసుకోకుండా, నేర్చుకున్న దానిపై టెస్టులు పెడతారు. అంతా సంతృప్తి కరంగా ఉంటే తమ దగ్గర నేర్చుకున్నట్లుగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఉంటే రోడ్డు ట్రాన్స్పర్టు అధికారులు కూడా పర్మినెంట్ లైసెన్సు ఇచ్చేయాల్సిందే. అదీ వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్ అంటే. అందుకే ఇక్కడ నేర్చుకున్న వారు గుండె నిబ్బరం, మనో ధైర్యంతో స్టీరింగు ముందు కూర్చుంటారు. మరి మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్ కి.