వార్తలు

నాడు – నేడు పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున

విశాఖపట్నం, సెప్టెంబరు 20: జిల్లాలో నాడు – నేడు పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా మండల అధికారులతో నాడు – నేడు పనుల పురోగతి పై సమీక్షించారు. పి.హెచ్.సి.ల మరమ్మత్తులను త్వరితగతిన చేపట్టాలన్నారు. వై .ఎస్.ఆర్.అర్బన్ మరియు రూరల్ క్లినిక్ పనులను వేగవంతం చేయాలన్నారు. పాడేరు మరియు అనకాపల్లి మెడికల్ కాలేజిల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలలో ఇంకా మిగిలి ఉన్న నాడు – నేడు పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఎన్.ఆర్.జి.ఎస్ పనులకు సంబందించి లేబర్ బడ్జెట్, 100 శాతం పనిదినాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనుల తీరును సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ పరిశీలన నిమిత్తం రానున్న నేపధ్యంలో డ్వామా సిబ్బంది, ఎం .పి.డి.ఓిలు సంబంధిత రికార్డులను సిద్దం చేసుకొని ఉండాలన్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనుల్లో భాగంగా ప్లాంటేషన్, ఉద్యానపంటలు అధికమొత్తంలో వేసి పరిరక్షణ భాద్యత చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, డ్వామా పి.డి సంధీప్, డి ఇ ఓ లింగేశ్వర రెడ్డి, పంచాయితీరాజ్ఇంజనీరింగు అధికారులు, తదితరులు హాజరయ్యారు.