వార్తలు

పవన్‌ చీప్‌ పబ్లిసిటీ మానుకోవాలి: సజ్జల

భారత్ వాయిస్, అమరావతి: బద్వేల్‌ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు.. అసలు ఎన్నకల్లో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్‌ ఎంత అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు చెయ్యడం మానుకోవాలి. కెమెరా అన్ చేసి యాక్షన్ అనగానే చెయ్యడానికి ఇది సినిమా కాదు. గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదు’’ అన్నారు సజ్జల. ‘‘రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 2,200 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్నాం. చీప్‌ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చెయ్యడం పవన్ కల్యాణ్ మానుకోవాలి. పవన్ స్థాయికి మేము దిగజారాల్సిన అవసరం లేదు. జనసేన దిశ లేకుండా ప్రయాణం చేస్తుంది. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసిన నష్టం ఏమి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్‌ ఎంత’’ అని సజ్జల ప్రశ్నించారు.