వార్తలు

పెర్ ఫెక్టు డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం.

 

 

భారత్ వాయిస్ : విశాఖపట్నం , 26, సెప్టెంబర్,2021:
డాక్టర్ కె ఎమ్ ప్రవల్లిక చే ద్వారకానగర్ మూడవ లైన్ లో నూతనంగా స్థాపించబడిన దంత వైద్యశాల ను ఎ . రామ్మోహన్ రెడ్డి, 

ఐ ఎఫ్ ఎస్ , జోనల్ డవలప్ మెంట్ కమిషనర్, విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ వారి చేతుల మీదగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో శ్రీ ఎ రామ్మోహన రెడ్డి డా। కె ఎమ్ ప్రవల్లిక ను ఆశీర్వదిస్తూ, పేద బడుగు వర్గాలకు సముచితమైన వైద్య సేవలు అందించాలని, ఈ వైద్య వృత్తిలో మంచి నైపుణ్యముతో విజయాలు సాధిస్తూ ప్రగతి పథంలో పయనిస్తూ ఎందరో డాక్టర్లకు మార్గదర్శకం కావాలని శ్రీ రామ్ మోహన్ రెడ్డి డాక్టరు ప్రవల్లిక కు మార్గ దర్శనం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖులు ఆర్ వి ప్రదమేశ్ ,ఐ ఆర్ ఎస్ సెంట్రల్ జి ఎస్ టి జాయింటు కమీషనర్ , , ఎస్ వి రమణ , మేనెజింగ్ డైరెక్టర్ , విశాఖడైరీ, శ్రీమతి ఓ. ఫణి, డిప్యూటీ డవలప్ మెంటు కమీషనర్ మరియు కె శ్రీనివాస్, అసిస్టెంట్ డవలప్ మెంట్ కమీషనర్ , ఆకుల చంద్రశేఖర్ , చార్టర్డు ఎకౌంటెంటు, వి పార్ధసారధి, సీనియర్ల న్యాయవాది, పి ఎల్ కె మూర్తి , పబ్లిక్ రిలేషన్ సోసైటి అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.