వార్తలు

ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి : ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి

భారత్ వాయిస్ , విశాఖపట్నం :

గులాబ్ తుఫాన్ నేపధ్యంలో కురిస్తున్న భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా పలు సూచనలను జారీ చేసారు. పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు నాణ్యమైన ఆహారం, మంచినీరు అందజేయడం తో పాటు అవసరమైన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలువ లేకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు. నీటి ద్వారా వ్యాధులు ప్రభల కుండ శానిటేషన్, బ్లీచింగ్ తదితర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్ డా ఎ మల్లిఖార్జున ముఖ్యమంత్రితో మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం రాత్రి ఒంటి గంట నుంచి 5 గంటల మధ్యలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసాయని , ఆరు మండలాల లో 28 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదు అయిందన్నారు. పెందుర్తి ,పెదగంట్యాడ, గాజువాక ,విశాఖపట్నం రూరల్, మధురవాడ లోతట్టు ప్రాంతాలలో జలమయమయ్యాయనీ, రాత్రి ముందు జాగ్రత్త గా 10,500 మంది నీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు. వర్షం తగ్గిన తర్వాత ఉదయం చాలా మంది వారి ఇళ్లకు వెళ్లిపోయారని ,ప్రస్తుతం 2,100 మంది 21 పునరావాస కేంద్రాలలో ఉన్నారని తెలిపారు. వారందరికీ నాణ్యమైన ఆహారం ,మంచినీరు అందించడం జరుగుతున్నదని తెలిపారు. జీవీఎంసీ పరిధిలో గల 88 జలమయమైన లోతట్టు ప్రాంతాలు, మరియూ కాలనీ లలో నీటిని ప్రత్యేక మోటార్లతో తొలగించడం జరుగుతున్నదని, సోమవారం మధ్యాహ్నం నాటికి అన్ని కాలనీలలో నిలువ నీటిని పూర్తిగా తొలగించడం జరుగుతుందని తెలిపారు. 128 చెట్లు నేల కూలాయని వాటిని తొలగించి రోడ్లను క్లియర్ చేయడజరిగిందన్నారు.
అదేవిధంగా 12 సబ్స్టేషన్స్ లో విద్యుత్కు అంతరాయం కలిగిందని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి రాత్రి ఒంటిగంటకు క్లియర్ చేయడం జరిగిందన్నారు. పెందుర్తి మండలం 94 వ వార్డులో డి భవాని (37) ఇల్లు గోడ కూలి మృతి చెందడం జరిగిందనీ, ప్రభుత్వం తరఫున 4 లక్షల రూపాయల చెక్కు ను వారి కుటుంబ సభ్యుల కు ఎక్స్ గ్రేషియా అందజేయడంజరిగిందన్నారు.
కలెక్టర్ కార్యాలయం లో గల జిల్లా ట్రజరి కార్యాలయం వర్షానికి పూర్తిగా డామేజ్ అవ్వడంతో సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కార్యాలయాన్ని సందర్శించారు . తగు చర్యలకు ప్రభుత్వానికి తెలియ జేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కే కన్నబాబు, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి అరుణ్ బాబు, జీ వీ ఎం సీ కమీషనర్ జి సృజన,ఎస్ పీ బీ కృష్ణా రావు,తదితరులు హాజరయ్యారు.