వార్తలు

ప్రతీ ఒక్కరి ఉన్నతికి తల్లే స్ఫూర్తి

ఎటువంటి అడ్డంకి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోని విజయాలను అంది పుచ్చు కోవాలి.. సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య
నర్సీపట్నం లోఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 

( భారత్ వాయిస్, నర్సీపట్నం) : బాలయోగి గురుకుల బాలికల రెసిడెన్షియల్(AP Residential Social Welfare Girls College) లో పి ఆర్ టి యు ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8న జరుపుకుంటున్న మహిళా దినోత్సవం ఏర్పాటుకు ముఖ్య కారణం మహిళలు ఆర్థికంగా ,రాజకీయంగా ,సామాజిక రంగాలలో తన భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు హక్కుల గురించి వారికి అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.1908 సంవత్సరంలో న్యూయార్క్ లో మహిళలు సమ్మె చేయడం తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, మహిళలు ఓటు వేసే హక్కు కోసం పోరాటం చేశారన్నారు.1909 సం లో అమెరికాలో సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందన్నారు.1910 సంవత్సరంలో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశంలో అంతర్జాతీయ హోదాను కల్పించారన్నారు. 1917 లో రష్యాలో మహిళలు ఓటు హక్కు కోసం సమ్మె చేయడంతో , ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించడం జరిగిందన్నారు.1996 మార్చి 8 నుండి ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం “Women in Leadership: Achieving an Equal Future in a Covid-19 World” నినాదాన్ని ప్రకటించారన్నారు. కుటుంబంలో పిల్లల ఉన్నతికి తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు.ఆడ,మగ తేడా

లేకుండా సమానదృష్టి తో పెంచడం ద్వారా వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారన్నారు.తను సివిల్స్ లో స్థానాన్ని సాధించడానికి తన తల్లే స్ఫూర్తి అని , అదే విధంగా ప్రతీ ఒక్కరి విజయాలకు తల్లి దండ్రులతో పాటు ఉపాధ్యాయుల కృషి ఉంటుందన్నారు.ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. విజయాలను అంది పుచ్చుకోవడానికి ఏకాగ్రతతో కష్టపడాలన్నారు. బాగా చదువుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకున్న నాడే సమాజంలో ఒక గుర్తింపు వస్తుందన్నారు. గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చంద్ర శారద మాట్లాడుతూ విద్య ఉంటే ఏదైనా సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పలు సంక్షేమ పథకాలను, మౌలిక వసతులను కల్పిస్తున్నారన్నారు. కాబట్టి బాలికలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పిఆర్టియు తరఫున జిల్లా ప్రెసిడెంట్ గోపీనాథ్ మరియు ప్రతినిధుల బృందం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య, మాకవరపాలెం, నర్సీపట్నం ఎమ్మార్వోలు రాణి అమ్మాజీ, జయ, ఎంపీడీవో అరుణ శ్రీ , కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శారద , ఎం ఈ వో సాయి శైలజ, హెడ్ మాస్టర్ కృష్ణవేణి, డివిజినల్ పిఆర్ఓ కే సుమిత్రాదేవి, ఉపాధ్యాయురాలు సుగుణ, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు శకుంతల, శిరీష తదితర మహిళా అధికారులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక లను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రెసిడెన్షియల్ స్కూలు విద్యార్ధినులు హాజరయ్యారు.