వార్తలు

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ‘సెయింట్ ఆంథోనీ స్కూల్ విద్యార్థుల కలయిక 

భారత్ వాయిస్, విశాఖపట్నం :

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నగరలోని ఒక ఫంక్షన్ హాల్ లో విశాఖలోని పేరెన్నికగన్న సెయింట్ అంథోని స్కూల్ 1980-81 బ్యాచ్ కు చెందిన నవ యువ విద్యార్థులు కలిసారు. ప్రతీ ఏడాది ఫ్రెండ్ షిప్ డే, కొత్త సంవత్సరం రెండవ ఆదివారం నాడు వీరంతా కలుస్తారు. మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. తమ స్నేహితుల్లో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే…తలో చేయి వేసి ఆదుకుంటారు. స్నేహితుల కలయిక సందర్భంగా ఏర్పాటు చేసే అల్పాహారాన్ని జోకులు వేసుకుంటూ ఆరగిస్తారు. వందకు పైగా ఉన్న వీరి ‘ ఎస్ ఎ ఎస్ 1980-81’ వాట్సప్ గ్రూపులో ఇంకా కొత్త వారిని ఆహ్వానించాలనే సదుద్దేశం వీరిలోని ప్రతీ ఒక్కరిలోను ఉండటం గమనార్హం. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఛార్టడ్ ఎకౌంటెంట్ వంటి వృత్తులలో ఉన్నారు. వ్యాపారవేత్తలతో పాటు రైల్వే,ఆర్టీసీ, ప్రోవిడెంట్ ఫండ్, స్లీల్ ప్లాంట్, హెచ్ పిసిఎల్, వంటి ప్రముఖ సంస్థలలో ఉన్నత స్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి హెూదాలో ఉన్నా… ఒకరికి ఒకరు ‘ ఒరేయ్ అని పిలుచుకుంటారు. ఏ ఒక్కరిలోనూ ఇగో ఫీలింగ్స్ లేకుండా ఉండటం వారి పవిత్రమైన స్నేహానికి గుర్తు. 1981వ సంవత్సరంలో చదువుకున్న వీరంతా 15 సంవత్సరాలు క్రిందట ఈ గ్రూపు గొడుగులోకి వచ్చారు. వీరంతా ఇలా రావడానికి కారణం యల్లాప్రగడ శ్రీనివాసరావు (వైఎస్ కె, కార్వీ శ్రీనివాస్) అనే చెప్పాలి. ఈయన కృషి కారణంగానే గత 15 సంవత్సరాలకు పైగా ప్రతీ ఏడాది సంవత్సరానికి రెండుసార్లు స్నేహితులంతా కలుసుకోవడం జరుగుతోంది. ఈ గ్రూపులోని ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడం గమనార్హం.