వార్తలు

మంచు విష్ణుకు ఆల్‌ ది బెస్ట్‌ : సూపర్‌ స్టార్‌ కృష్

భారత్ వాయిస్ :మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు దగ్గరపడుతు‍న్నాయి. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ సారి ‘మా’ అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు పోటీ పడుతున్నారు. సెప్టంబర్‌ 27న నామినేషన్లు కూడా ముగియడంతో అభ్యర్థులంతా సభ్యులతో కలిసి ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో బరికిలో దిగుతున్న అభ్యర్థులు పరిశ్రమ పెద్దల మద్దతు కోరుతున్నారు. తాజాగా మంచు విష్ణు తన ప్యానల్‌తో కలిసి సూపర్‌ స్టార్‌ కృష్ణను కలిశారు. కుమారుడు మంచు విష్ణు వెంట తండ్రి మోహన్‌బాబు కూడా ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కృష్ణను మోహన్‌బాబు, మంచు విష్ణులు కోరారు. దీనికి కృష్ణ స్పందిస్తూ.. మంచు విష్ణుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.