వార్తలు

మంచు విష్ణుకు బాలకృష్ణ మద్దతు

భారత్ వాయిస్, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలో హీరో బాలకృష్ణ మద్దతు తనకు ఉందని మంచు విష్ణు తెలిపారు. మా అధ్యక్ష పదవికి సీవీఎల్‌ నరసిం‍హరావు, జనరల్ సెక్రెటరీ పదవికి బండ్ల గణేష్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి రేసులో వున్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. అక్టోబర్‌ 10న మా ఎ‍న్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ ఎన్నికల్లో బాలకృష్ణ తనకే మద్ధతు ఇస్తున్నారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో బాలకృష్ణతో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఆశీర్వదించి, మా ప్రెసిడెంట్‌గా  మద్ధతు ఇచ్చినందుకు ధన్యవాదాలు బాల అన్న అంటూ విష్ణు ట్వీట్‌ చేశారు. అఖండ సెట్‌కు వెళ్లిన మంచు విష్ణు ఈ సందర్భంగా ఆయనతో సరదాగా ముచ్చటించారు. ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది.