వార్తలు

మద్య నియంత్రణ వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్

భారత్ వాయిస్, విశాఖపట్నం :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ కార్యక్రమాలతో మద్య నియంత్రణ వైపు వేగంగా అడుగులు వేస్తుందని మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
ఈనెల 25వ తేదీన విశాఖపట్నం లోని సెబ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.గత రెండు సంవత్సరాలుగా మద్యం అమ్మకాలు 40శాతం,బీరు అమ్మకాలు 78 శాతం తగ్గటం శుభపరిణామమన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు 34 లక్షల కేసులు మద్యం అమ్మకాలు జరగ్గా నేడు 21 లక్షల కేసులకు తగ్గిందని బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుండి 7 లక్షల కేసులకు తగ్గాయని వివరించారు.గతంలో ప్రైవేటు రంగంలో మద్యం షాపులు ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విక్రయిస్తుండుగా నేడు ప్రభుత్వ మద్యం షాపులు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే పనిచేస్తున్నాయని అన్నారు.గత ప్రభుత్వం మద్యం వ్యసనాన్ని అనధికారిక బెల్టు షాపుల ద్వారా ప్రజల చెంతకు చేరిస్తే నేడు బెల్టుషాపులను సమూలంగా తొలగించడం జరిగిందన్నారు.మద్యం ధరలు పెరగటం వలన మద్యం అమ్మకాలు తగ్గినా మరొకవైపు అక్రమమద్యం, నాటుసారా,గంజాయి లాంటి మత్తుపానీయాలు పెరుగుతున్నాయని వీటిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కు నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ వినీత్ బ్రీజ్ లాల్ నేతృత్వంలో ఏర్పటు చేసి అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు.మద్యం దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి మద్య విమోచన ప్రచార కమిటీ ఏర్పడి కృషి చేస్తుందన్నారు.భవిష్యత్తులో ఇంజనీరింగ్,మెడికల్ కళాశాలలో యూనివర్సిటీ ప్రాంగణాల్లో సాంస్కృతిక బృందాల ద్వారా కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతను జాగృతలను చేస్తామని తెలిపారు.16 నెలలు క్రితం ఏర్పడిన
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మద్యం అక్రమ రవాణా తయారీపై 1,20,822 కేసులు నమోదు చేసి 1,25,202 నిందితులను అరెస్టు చేశారని,8,30,910 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం 8,07,644 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవటం 2,30,48,401 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేయడం, అక్రమ మద్యం రవాణా చేస్తున్న 29,491 వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు.గంజాయి సాగు రవాణాపై 220 కేసులు నమోదు చేసి 364 మంది నిందితులను అరెస్టు చేసి 18,686 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను మరింత బలోపేతం చేసి అక్రమదారులపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.ఇటీవల మద్య విమోచన ప్రచార కమీటి రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి రాష్ట్ర డీజీపి గౌతం సవాంగ్ వినతిపత్రం అందించగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారన్నారు.మద్యం అక్రమాలపై,మత్తు పానీయాల పై 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు చేపడతామని వివరించారు.వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న మద్యం వ్యసనాన్ని నిర్మూలించడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు.ప్రజలను నిరంతరం
జాగృతులను చేస్తూ మద్యం దుష్పలితాలను తెలియజేయడానికి మహిళా సంఘాలు,డ్వాక్రా మహిళలు,వాలంటీర్లు గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది తో సమిష్టి కృషి జరగాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన 15 డీ- అడిక్షన్ కేంద్రాలకు వ్యసనపరులను గుర్తించి వారికి ఉచితంగా లభించే చికిత్స సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ సమావేశం లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)డిప్యూటీ కమిషనర్ యస్.వి.వి.యన్. న్ బాబ్జి, అసిస్టెంట్ కమీషనర్ పి.రామచంద్రరావు,అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీనాధ్
లు పాల్గొని ప్రసంగించారు.