వార్తలు

మారికావలస బాలుర గురుకుల పాఠశాల విద్యకమిటి చైర్మన్ గా శ్రీ కీల్లోసురేంద్ర

వైస్ చైర్మన్ గాను శ్రీమతి తెలగంజి పద్మను మరియు 13 మంది కమిటీ సభ్యులు

భారత్ వాయిస్ : విశాఖపట్నం మారికావలస బాలుర గురుకుల పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ.ఎమ్.శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల విద్యకమిటి ఎన్నికల్లో విద్యకమిటి చైర్మన్ గాను శ్రీ కీల్లోసురేంద్ర వైస్ చైర్మన్ గాను శ్రీమతి తెలగంజి పద్మను మరియు 13 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు* .ఏకగ్రీవంగ ఎన్నికైన విద్యకమిటి చైర్మన్ శ్రీ కీల్లోసురేంద్ర మాట్లాడుతూ మారికావలస బాలుర గురుకుల పాఠశాలలో 450 మంది ఏజెన్సీ11 మండలాల గిరిజన విద్యార్థులు మరియు సబ్ ప్లాన్ ఏరియా గిరిజన విద్యార్థులు సదువుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు విద్యార్థుల స్కూల్ కమిటీ సభ్యులు బాధ్యతతో స్కూల్ కమిటీ చైర్మన్ గాను ఎన్ను కున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన పాఠశాల ప్రిన్సిపాల్ మరియు స్కూల్ సిబ్బందికి అభినందనాలుతెలిపారు. గురుకుల పాఠశాలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింసుటకు పాఠశాల ఉపాద్యాయుల సహకారంతో కృషి చేస్తానని ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గిరిజన విద్యార్థులకుఅందరికి అందేవిదంగా కృషిసేస్తానని విద్యార్థులకు ఉత్తమమైన మేధావులుగా తీర్సిదిద్దుటకు తన వంతు కృషిచేస్తానని పాఠశాలలో మౌలిక సమస్యలు పరిష్కరించుటకు కృషిచేస్తు క్రమశిక్షణ కల్గిన విద్యాభివృద్ధికి కమిటీ సభ్యులు,విద్యార్థులు తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాద్యాయులు అందరు పాటుపడి గిరిజన విద్యాభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు
ఈకార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ.కిశోర్ బాబు,పాఠశాల ఉపాద్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు తో బాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు