వార్తలు

ప్రతీ అమ్మ కళ్లలో ఆనందాన్ని చూడడమే మన ముఖ్యమంత్రి లక్ష్యం..

రెండవ విడత అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన నర్సీపట్నం శాసన సభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్….

నర్సీపట్నం, భారథ్ వాయిస్
ప్రతి తల్లి తన బిడ్డను మంచి చదువులు చదివించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆలోచనతో వుంటుందని, ఆమె కలలను సాకారం చేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి “అమ్మ ఒడి” పథకాన్ని ప్రారంభించారని శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో శాసనసభ్యులు రెండో విడత అమ్మ ఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ధ్యేయంగా వారి అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ 18 నెలల కాలంలో వందకు పైగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించి అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అన్నారు.కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో అమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వారి పిల్లల చదువు నిమిత్తం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ను మనబడి -నాడు-నేడు పథకం కింద మూడు దశలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరుగు తుందన్నారు. ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బాలికల డ్రాపౌట్స్ తగ్గించడానికి పాఠశాలలలో టాయిలెట్స్ నిర్మాణాలతో ప్రత్యేక పారిశుద్ధ్యాన్ని , నిరంతరం నీటి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.

జగనన్న గోరుముద్ద పథకం కింద నాణ్యమైన పోషకాహారాన్ని మంచి మెనూ ప్రకారం అందిస్తున్నారన్నారు.

అన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ ,అంగన్వాడి స్కూల్స్లో ఆంగ్ల బోధన ఫిబ్రవరి నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు.

విద్యా దీవెన పథకం కింద డిగ్రీ ,మెడిసిన్, ఇంజనీరింగ్ ,పాలిటెక్నిక్, అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.

వసతి దీవెన పథకం లో వసతి కల్పించడంతోపాటు, భోజనం , రవాణా ఖర్చు అందిస్తున్నారన్నారు.
చదువుకు పేదరికం అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు.
రెండవ విడత అమ్మ ఒడి పథకం కింద నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు నర్సీపట్నం , మాకవరపాలెం , నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి కి సంబంధించి 35,724 మంది (అమ్మలకు) లబ్ది దారులకు మొత్తం రూ 53,60,70,000/- వారి ఖాతా లలో జమ అవుతున్నదన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు చెక్కును అందజేశారు.
రెండో విడత అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద బొడ్డేపల్లి జడ్పిహెచ్ఎస్కూల్లో పదవ తరగతి చదువుతున్న షణ్ముఖప్రియ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పై ఆంగ్లంలో మాట్లాడి శాసన సభ్యుల నుండి ప్రశంసలందుకున్నది.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పి కనకారావు, నియోజకవర్గ నాలుగు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మెప్మా, మున్సిపాలిటీ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
……….

 

.

Comment here