వార్తలు

రైతు బజార్లు పూర్తిస్థాయిలో ప్రక్షాళన

జాయింటు కలక్టరు ఎం. వేణుగోపాలరెడ్డి
విశాఖపట్నం, జవనరి 11: రైతుబజార్లను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయుటకు చర్యలు చేపట్టనున్నట్లు సంయుక్త కలక్టరు ఎం .వేణుగోపాలరెడ్డి తెలిపారు. సోమవారం కలక్టరు కార్యాలయంలోని తన చాంబరులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుబజార్ల ప్రక్షాళనకు మార్కెటింగు, ఉద్యాన,వ్యవసాయ,పౌర సరఫరాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ నగరంలో గల 13 రైతుబజార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రైతుబజార్ల ప్రక్షాళనకు తీసుకోవలసిన చర్యలు గూర్చి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా
 రైతు బజార్లలో డ్వాక్రా సంఘాలకు కేటాయించిన షాపులను జి.ఒ.నంబరు29 ప్రకారం 3 సంవత్సరాల పూర్తయిన వాటి స్థానంలో కొత్తవారికి నిబంధనల ప్రకారం ఎంపిక చేసి షాపులు కేటాయించాలన్నారు.
 రైతు లందరికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి 6 నెలలకు వారు పండించే పంట వివరాలతో కూడిన కొత్త కార్డులు జారీ చేయాలన్నారు. అందుకు గాను సచివాలయంలో గల హార్టికల్చరల్ సహాయకులు లేదా వ్యవసాయ సహాయకులు దృవపత్రం సమర్పించాలని తెలిపారు.
 రైతుబజార్లలో ఉదయం 10 గంటల లోపున హోల్ సేల్ వ్యాపారులకు అమ్మకాలు చేయకూడదు.
 రైతుబజార్లలో నిర్ణయించిన రేట్లను ఉదయం గం.7.00 ని. కల్లా ప్రదర్శించాలి.
 ఎస్టేట్ అధికారి ఉదయం 6.30 గంటలలోపున విధులకు హాజరుకావాలి. లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది.
 రైతుబజార్లలో డ్వాక్రా, ఇతర షాపుల వారు అధిక ధరలకు అమ్మకాలు చేయరాదు.
 మరణించినరైతుల స్థానంలో భర్తీ చేయుటకు నామినిరిక్వెస్ట్ లను ప్రతి 15 రోజులకు పరిష్కరించాలి
 , జి.వి.యం.సి. వారితో సమన్వయం చేసుకొని పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.
 వినియోగదారుల నుండి పిర్యాదులు స్వీకరించుటకు కన్సూమర్ బాక్సు ఏర్పాటు చేయాలి.
 రైతుబజార్ల లో షాపుల కేటాయింపు పారదర్శకంగా చేపట్టుట కొరకు, ధరఖాస్తులు స్వీకరణ, కేటాయింపు, పిర్యాదుల స్వీకరణకు, సమాచారం అందరకు అందుబాటులో ఉండుటకు వెబ్ సైట్ రూపొందించ వలసినదిగా తెలిపారు.
రైతుబజార్ల ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలను రైతుబజార్ల ఉప సంచాలకులు పూర్తి భాద్యత తీసుకొని పర్యవేక్షించాలని, 15 రోజులలో చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
రైతుబజార్లలో సి.సి. కెమెరాలు, ఆర్.ఒ. ప్లాంట్స్, డిస్ ప్లే బోర్డులు పనిచేయకపోవుట, వాహనాల పార్కింగు సమస్య విషయాలను కమిటీ తెలియజేయగా వెంటనే చర్యలు తీసుకోవలసినదిగా సహాయ సంచాలకులు కాళేశ్వరరావును జాయింటు కలెక్టరు ఆదేశించారు.
ఈ సమావేశంలో మార్కెటింగుశాఖ, సహాయ సంచాలకులు కాళేశ్వరరావు, రైతుబజార్ల ఉప సంచాలకులు పాపారావు, ఎర్రన్న, ఉద్యానవన అధికారి రాధిక, వ్యవసాయశాఖాధికారి తులసి, డిప్యూటీ తహశీల్దారు సత్యవతి, వ్యవసాయ అసిస్టెంటు గణపతి తదితరులు పాల్గొన్నారు.

 

Comment here