PIB
పశ్చిమ బంగాల్ లోని నోవాపాడా నుంచి దక్షిణేశ్వర్ వరకు విస్తరించిన మెట్రో రైల్వే మార్గాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు ప్రారంభించడం తో పాటు ఆ మార్గం లో మొదటి మెట్రో సర్వీసు కు ప్రారంభ సూచకం గా పచ్చజెండా ను కూడా చూపించారు. కలాయీకుండా, ఝార్గ్రామ్ ల మధ్య మూడో మార్గాన్ని కూడా ఆయన ప్రారంభించారు.ఈస్టర్న్ రైల్వే లో అజీమ్ గంజ్ నుంచి ఖర్గాఘాట్ రోడ్ సెక్షన్ వరకు వేసిన జోడు రైలు పట్టాల ను సైతం దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. దన్‌కునీ కి, బరూయీపారా కు మధ్య నాలుగో లైను ను, రసూల్ పుర్ కు, మగ్ రా కు మధ్య మూడో రైలు ను కూడా దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న ప్రారంభించిన పథకాలు హుగ్ లీ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న లక్షల కొద్దీ ప్రజల జీవనాన్ని సరళతరం చేస్తాయన్నారు. రవాణా కు ఉపయోగపడే సాధనాలు మెరుగైన కొద్దీ మన దేశం లో స్వయంసమృద్ధి, విశ్వాసం తాలూకు సంకల్పాలు దృఢతరం కాగలవన్నారు. కోల్‌కాతా తో పాటు హుగ్ లీ, హావ్ డా, నార్త్ 24 పరగణాస్ జిల్లా ల ప్రజలు కూడా మెట్రో సర్వీసు ప్రయోజనాల ను అందుకొంటారని ఆయన చెప్తూ, ఈ విషయమై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నోవాపాడా నుంచి దక్షిణేశ్వర్ కు విస్తరించిన మెట్రో రైల్వే ను ప్రారంభించుకోవడం తో, ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ కాలం 90 నిమిషాల నుంచి 25 నిమిషాల కు తగ్గిపోతుందని ఆయన చెప్పారు. ఈ సర్వీసులు విద్యార్థుల కు, శ్రామికుల కు ఎంతగానో ఉపయోగకరం కాగలవన్నారు. భారతదేశం లో మెట్రో లేదా రైల్వే వ్యవస్థ ల నిర్మాణం లో ఈ మధ్య కాలం లో ‘మేడ్ ఇన్ ఇండియా’ తాలూకు ప్రభావం కనిపిస్తోంది అంటూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పట్టాల ను వేయడం మొదలుకొని, ఆధునిక రైలు బండ్ల వరకు, అలాగే ఆధునిక రైళ్ళు మొదలుకొని ఆధునిక రైలు పెట్టెలు, గూడ్స్ తో పాటు భారీ ఎత్తున వినియోగిస్తున్న సాంకేతికత సైతం దేశీయం గానే తయారవుతోందన్నారు. ఇది ప్రాజెక్టు అమలు ను వేగవంతం చేసిందని, నిర్మాణం లో నాణ్యత ను పెంచిందని ఆయన వివరించారు. దేశం లో స్వయంసమృద్ధి తాలూకు ఒక ముఖ్యమైన కేంద్రం గా పశ్చిమ బంగాల్ ఉంటూ వచ్చిందని, పశ్చిమ బంగాల్ కు, దేశ ఈశాన్య ప్రాంతాని కి అంతర్జాతీయ వ్యాపారం తాలూకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కొత్త రైలు మార్గాలు మనిషి జీవనాన్ని సరళతరం గా మార్చుతాయని, పరిశ్రమల కు కూడా కొత్త మార్గాలు అందుబాటు లోకి వస్తాయని ప్రధాన మంత్రి వివరించారు.