వార్తలు

విశాఖ నగర అభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ఎ్రౌధాన్యత

జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు

Bhaarath voice, విశాఖపట్నం , డిసెంబరు 30: విశాఖ నగర అభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ఎ్రౌధాన్యత కల్పిస్తూ పలు సంక్షేమ ప్రణాళికలను రూపొందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గురువారం విఎంఆర్డిఎ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లాలో అమలు జరుగుతున్న ముఖ్యమైన అభివృద్ది కార్యక్రమాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డితో కలిసి కోవిడ్/ఒమిక్రాన్ ముందస్తు జాగ్రత్తలు, విఎంఆర్డిఎ, జివిఎంసి, హౌసింగ్,టిడ్కో, ఎండోమెంట్స్ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో అభివృద్ది శరవేగంగా జరుగుతోందని ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేసామో మరియు జరుగుతున్న ప్రాజెక్టుల పనులు ఏఏ దశలలో ఉన్నది సమీక్షించుకోవటం జరుగుతోందన్నారు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి మొదట విడత శతశాతం పూర్తయిందని, రెండవ డోసు 73 శాతం అయిందని మిగిలినది ఫిబ్రవరి నెలఖారు లోగా పూర్తయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా కలెక్టరుకు సూచించారు. 3rd వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అన్ని ప్రభుత్వ మరియు గుర్తించబడిన ఆసుపత్రులలో అవసరమైన బెడ్లను , ఆక్సిజన్ కాన్సెంట్రేట్లను , డ్రగ్స్ ను అందుబాటులో ఉంచాలన్నారు. విశాఖలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయిందని దానికి సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను క్యారంటైన్ చేయడం జరిగిందని , రానున్న రోజులలో కూడా కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మాస్కులు, సామాజిక దూరం పాటించే విధంగా ప్రజలలో కౌన్సిలింగ్ చేపట్టడం ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. జనవరి 3 నుండి 7వ తేదీ వరకు 15 నుండి 18 సంవత్సరాల వారికి మొదటి విడత వ్యాక్సిన్ డోస్ వేయడానికి షెడ్యూల్ తయారు చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆక్రమణదారులు ధనవంతులైన పక్షంలో ఎట్టి పరిస్తితులలోనూ ఉపేక్షించకుండా సంబంధితులపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. సింహాచలం దేవస్దాన భూములకు సంబంధించి ఆక్రమణదారులను విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. దేవస్థాన భూముల రక్షణకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మరియు గిరి ప్రదక్షణ నడక దారులకు ఎస్టిమేషన్ వేసి నివేదికను పంపాలన్నారు.
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సెకెండ్ వేవ్ వచ్చినప్పుడు గాజువాకలో ప్రగతి భారత ట్రస్టు ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి 300 ఆక్సిజన్ కాన్స్ న్ట్రేటర్లను అవసరమైన ప్రత్యేక ఎక్విప్ మెంట్ను ఉపయోగించడం జరిగిందని ప్రస్తుతం ఆ మొత్తం పరికరాలను కెజిహెచ్, విమ్స్ ఆసుపత్రులకు ఉచితంగా అందజేయడానికి నిర్ణయం తీసుకున్నామని ఇవి ప్రజలకు మరింత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా అన్నారు. నగరంలో ఎంఐజి లేఅవుట్ లకు సంబంధించి అర్హులైన మధ్య తరగతి కుటుంబాల వారికి అందే విధంగా చూడాలని విఎంఆర్డిఏ కమీషనర్ కు సూచించారు. అధే విధంగా ఆయా భూములలో ఎన్ని ఆక్రమణలకు గురి అయ్యాయి వాటి మీద తీసుకొంటున్న చర్యలను గూర్చి అడిగారు. షాపులకు సంబంధించి వాటి అద్దె, వేలం ప్రక్రియ ద్వారా ఎంత ఆదాయం వస్తుందని అడిగి తెలుసుకొన్నారు. అదే విధంగా చాలా షాపులకు బినామీలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని వాటిపై తగు చర్యలు చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించాల్సిందిగా జిల్లా కలెక్టరుకు సూచించారు. స్మార్ట్ సిటీ అభివృద్ది పనులకు సంబంధించి పరిశీలించాల్సిందిగా జివియంసి కమీషనర్ కు సూచించారు. మురికి వాడలలో నివసిస్తున్న వారి వివరాలను జనవరి నెలాఖారు నాటికి సర్వే చేసి వారికి పట్టాలు ఇవ్వడానికి సిద్థం చేయాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ లో భాగంగా డస్ట్ బిన్స్ ప్రతీ కుటుంబానికి సప్లై చేయాలన్నారు. టిడ్కో హౌసింగ్ ను ప్రాధాన్యత అంశంగా తీసుకొని ప్రజాప్రతినిధులతో చర్చించి నిరయాలను తీసుకోవాలన్నారు. సింహాచలం భూములకు సంబంధించి తిరువన్నామలై దేవాలయం తరహాలో గిరి ప్రదక్షనకు నడక దారి నిర్మాణాలకు సంబంధించి ఎంపి ల్యాడ్స్ నుండి తాను అయిదు కోట్లు ఇవ్వనున్నామని, అనకాపల్లి ఎంపి ల్యాడ్స్ నుండి మూడు నుండి అయిదు కోట్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంకా అవసరం మేరకు నాన్ ప్రయివేట్ ఎంటర్ప్రైజస్ నుండి డొనేషన్లు, సిఎస్ఆర్ ఫండ్స్ మొదలైన వాటిని ఉపయోగించాలని కలెక్టర్ కు సూచించారు. ఉచితంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్ లను ఆహ్వానిస్తున్నామన్నారు. పంచ గ్రామాలలో నివసిస్తున్న పేద వారు వారి ఇళ్ల మరమత్తులకు ఆటంకం కల్పించకుండా ఎన్ఓసి లను ఇవ్వాలని సింహాచలం ఈఓ కు తెలిపారు. దేవాలయ ఆస్థులను కాపాడుకోవాలని, జిల్లాలో జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలను గుర్తించి ఎస్టిమేషన్ తయారు చేసి దశల వారీగా వాటిని మరమత్తులు చేపట్టాలని ఎండోమెంట్స్ డిప్యూటీ కమీషనర్ కు తెలిపారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మట్లాడుతూ నియోజకవర్గాలలో అమలు జరుగుతున్న అభివృద్దిపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అన్నారు. ఇకపై జిల్లా అభివృద్ది సమావేశంలో నగర అభివృద్ది అంశాలతో పాటు గ్రామీణ అభివృద్ది మరియు సమస్యలపై కూడా చర్చించాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధ్యక్షతన జరిగిన డీఆర్సి సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏ లు లేవనెత్తిన అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో విశాఖపట్నం , అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, బి.సత్యవతి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు,జిల్లాపరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర , నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, వి.ఎం.ఆర్.డి.ఎ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎంఎల్ సి లు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కళ్యాణి , శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అమర్ నాథ్, అదీప్ రాజ్, పలు కార్పరేషన్ ల చైర్మన్ లు, విఎంఆర్డిఏ, జివియంసి కమీషనర్ లు వెంకటరమణా రెడ్డి, లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనాకుమారి, జిల్లా అధికారులు హాజరయ్యారు.
జారి: డివిజనల్ పౌరసంబందాల అదికారి,నర్సిపట్నం