వార్తలు

శాస్త్ర సాంకేతిక రంగాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మహదేవ్ వర్మదే : ఏయు రిజిస్ట్రార్ ఆచార్య వి. కృష్ణ మోహన్.

(భారత్ వాయిస్ , విశాఖపట్నం) : ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి , సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏర్పాటుకు శాస్త్ర సాంకేతిక రంగాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మహదేవ్ విక్రందేవ్ వర్మదే నని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్వి .కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఏయూ లోని ఫిజిక్స్ విభాగంలో మహదేవ్ విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మహాదేవ్ విక్రమ్ వర్మ వారసులు మహారాజా విశ్వేశ్వర చంద్రచూడ్ దేవ్, సారికా దేవి సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ పివిఎస్. మాధవ్ తో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆచార్య కృష్ణ మోహన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన ఎంతో శ్రద్ధతో అభివృద్ధి చేశారన్నారు. సైన్స్ కాలేజ్ కి భూములు ఇచ్చి, భవనం నిర్మించి నిధులు కూడా వెచ్చించారని తెలిపారు. సైన్స్ కాలేజీలో ఉన్నత చదువులు చదివి విశ్వవ్యాప్తంగా అనేక గొప్ప పదవుల్లో ఉన్నారన్నారు. మహదేవ్ వారసులు ఇక్కడ మౌలిక సదుపాయాలు నిచ్చెన ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. వారి సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక మన్నారు. ఎమ్మెల్సీ పి వి ఎస్ మాధవ్ మాట్లాడుతూ మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు మహాదేవ్ విక్రమ్ దేవ్ వర్మ చేసిన కృషి మరువలేనిదన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటుకు ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మహాదేవ్ విక్రమ్ దేవ్ వర్మ వారసులు భాగస్వాములై ఉండాలన్నారు. వారి సంతానం కూడా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో లిరిక్స్ విభాగాధిపతి డిబి. వెంకటాద్రి,విక్రమ్ దేవ్ వర్మ వారసులు విశ్వేశ్వర చంద్రచూడ్ దేవ్, మహారాణి సారిక దేవి, కిషన్ రాథోడ్ ,క్రాంతి పిక్చర్స్ అధినేత వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.