వార్తలు

సబ్ కా డైరీ ఆవిష్కరణ 2022

Bharath voice, విశాఖపట్నం 30 డిసెంబర్ 2021 : వి ఎం ఆర్ డి ఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన స్టేట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్ కా) ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిల్డింగ్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలోప్రత్యేక అతిధిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడుతూ గుత్తేదారులు కుల మతాలకు అతీతంగ ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారని ఈ ప్రభుత్వంలో గుత్తేదారులు ఇబ్బందులు పడుతున్నారని, బిల్లులు కూడా రావడం లేదని అన్నారు. అనంతరం బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఆర్ ఎన్ గుప్తా సబ్కా 2022 డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో జనరల్ మేనేజర్ అండ్ కన్వీనర్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వి బ్రహ్మానంద రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ ఏ కే బాలాజీ , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ 1, బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా వి వెంకటేశ్వర రావు, జోనల్ హెడ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కె శ్రీనివాస్, మెంబెర్, ఎం ఎస్ ఎం ఈ ఎస్ సత్యబాబు, స్టేట్ చైర్మన్, బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్, డి పంకజ్ రెడ్డి, చైర్మన్, ఎమ్ ఎస్ ఎమ్ ఈ కమిటీ, బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బి ఏ ఐ ) చెరువు రామకోటయ్య, సబ్కా హానరరీ ప్రెసిడెంట్ ఆర్ వి రాయణం , సబ్కా అధ్యక్షులు పి పి రాజు, వైస్ ప్రెసిడెంట్, ఎం వి ఏ సూర్యప్రకాష్, వి రాజగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సబ్కా ఎస్ విజయకుమార్, వైస్ ప్రెసిడెంట్, బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్, ఏ నాగమల్లేశ్వరి రావు, స్టేట్ సెక్రటరీ, బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్,బి రాఘవరావు, అల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబెర్, బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా, ఏ కసి విశ్వేశ్వర రావు, ఎం నాగేశ్వర రావు మరియు సబ్కా ట్రేసరర్ ఏ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.