సినిమా

పెళ్లి సందడి చిత్రం సరికొత్త రికార్డు లు సృష్టించేందుకు సన్నద్దం

భారత్ వాయిస్, విశాఖపట్నం : పెళ్లి సందడి చిత్రం సరికొత్త రికార్డు లు సృష్టించేందుకు సన్నద్దం అయిందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు.పెళ్లి సందడి చిత్ర ప్రమోషన్ విశాఖ నగరంలో సోమవారం యూనిట్ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో హొటల్ దసపల్లా లో జరిగిన విలేకరుల సమావేశం లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఈ చిత్రానికి తన శిష్యురాలు విశాఖ వాసి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు అన్నారు. తాను శ్రీకాంత్ హీరోగా దర్శకత్వం వహించిన పెళ్లి సందడి చిత్రం విడుదలై పాతికేళ్ళు అయింది అన్నారు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు అదే చిత్రం టైటిల్ తో రావడం దైవ సంకల్పం . తాను తొలి సారిగా ఈ చిత్రం లో నటించటం ఓ గొప్ప అనుభూతి ఇచ్చింది. రాజేంద్రప్రసాద్ తో కలిసి జర్నీ లో తన పాత్ర ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరమైన, నవ్వించే పాత్ర తాను చేశాను అన్నారు. ఈ చిత్రానికి కీరవాణి అత్యద్భుత సంగీతం అందించారు. విశాఖ అంటే ఇష్టం కాబట్టి తమ బృందం చిత్ర ప్రమోషన్ ఇక్కడ ప్రారంభించాం. విజయయాత్ర కూడా ఇక్కడే ప్రారంభిస్తాం అని చెప్పారు. చిత్ర హీరో రోషన్ మాట్లాడుతూ తాను రాఘవేంద్రరావు చిత్రం లో నటిస్తాను అని ఊహించలేదు. తన తండ్రి వలె తనకు కూడా పెళ్లి సందడి చిత్రం టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది అన్నారు. డైరెక్టర్ గౌరి ఎంతో బాగా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు అన్నారు. తన తండ్రి చిత్రాలలో ఖడ్గం వంటి పాత్ర తనకు చేయాలి అని ఉంది అన్నారు. హీరోయిన్. శ్రీలీలా మాట్లాడుతూ స్వతహాగా డాక్టర్ అయిన తాను యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం తో ఈ చిత్రం లో హీరోయిన్ గా అవకాశం దక్కింది అన్నారు. ఇంత మంచి సీనియర్ లు, గొప్ప టీం ఈ సినిమా కు ఉండడం తో తనకు తొలి సినిమా తోనే చాలా క్రేజ్ దక్కింది అన్నారు. సంపూర్ణ పెళ్లి భోజనం వంటిది తమ పెళ్లి సందడి చిత్రం అన్నారు. తాను విశాఖ చాలా సార్లు వచ్చానని ఈ నగరం తనకు ఎంతో ఇష్టమన్నారు. విశాఖ వాసి, చిత్ర దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ పెళ్లి సందD చిత్రం దర్శకత్వం వహించేందుకు అవకాశం కల్పించిన తన గురువు రాఘవేంద్రరావు మేలు ఈ జన్మకు మరువలేమన్నారు. తాను తొలి చిత్రం లో రాఘవేంద్రరావు తొలి సారిగా నటించడం మరో గొప్ప విశేషం అని, అదే ఈ చిత్రానికి గొప్ప హైప్ తెచ్చింది. ఈ నెల 15న విడుదల అవుతున్న పెళ్లి సందD చిత్రంను విజయవంతం చేయాలని కోరారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చిత్ర డిస్ట్రిబ్యూటర్ గాయిత్రి దేవి ఫిల్మ్స్ అధినేత సతీష్ పాల్గొన్నారు.