సినిమా

ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూత

చెన్నై : 2021 ఏడాది ప్రారంభంలోనే సినీ ఇండస్ట్రీలో విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం అకాల మరణం చెందారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఆయనకు ఇద్దరు తనయులు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి. అతను కూడా సినీ రచయిత. రెండవ తనయుడు రాకెందు మౌళి. కాగా డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్‌గా వెన్నెలకంటికి మంచి పేరు ఉంది. తమిళ సినిమాలకు కూడా లిరిక్స్ అందించారు. చదవండి: తేజకు నో చెప్పిన కాజల్‌.. తాప్సీ ఓకేహరి కథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడాన్ని ఆయన బాగా ఇష్ట పడేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1986లో భాస్కర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన శ్రీరామ చంద్రుడు సినిమాతో గీత రచయితగా వెన్నెలకంటి ప్రస్థానం మొదలైంది. వెన్నెలకంటి తండ్రి ‘ప్రతిభా’ కోటేశ్వరరావుకూ సినీ అనుబంధం ఉంది. ఎస్పీబీ ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1500కు పైగా స్ట్రెయిట్‌ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు. బ్యాంకు ఉద్యోగిగాను ఆయన పని చేశారు. చదవండి: ప్రముఖ దర్శకుడు కన్నుమూత.

Comment here