COLLECTORATE

ఎగుమతులను చేపట్టడానికి సబ్ కమిటీల ఏర్పాటు కు చర్యలు : జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున

భారత్ వాయిస్ : విశాఖపట్నం, సెప్టెంబరు 23: సీఫుడ్స్ మరియు మెరైన్ ఉత్పత్తులు, ఫార్మా, కాయర్ మొదలైన రకాలను అభివృద్ది చేసి ఎగుమతులను చేపట్టడానికి సబ్ కమిటీల ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని జిల్లా పరిశ్రమలు, మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటి (డిఐఇపిసి) చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సంబందిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో డిఐఇపిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫార్మా , బల్క్ డ్రగ్స్ ఎగుమతులకు సంబందించి ప్రతి 10 రోజులకు సబ్ కమిటీలు సమావేశాలను నిర్వహించాలన్నారు. వీటికి సంబందించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలన్నారు.
జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఫార్మాకంపెనీలు 120 యూనిట్లు ఫార్మా హబ్ గా ఏర్పాటయ్యాయని, మరో 50 ప్రతిపాదనలు వివిద దశలలో ఉన్నాయన్నారు. అచ్చుతాపురం ఎస్.ఇ.జెడ్ లో 27 కంపెనీలు నిర్మాణపు పనులలో ఉన్నాయని, ఏడు కంపెనీలు ప్రోడక్షన్ కు సిద్దంగా ఉన్నాయన్నారు. సీఫుడ్, మెరైన్ ప్రోడక్ష్స్ సబ్ కమిటి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2,16,457 మెట్రిక్ టన్నుల సీఫుడ్ ను వైజాగ్ పోర్టు ద్వారా ఎగుమతి చేయడం జరిగిందన్నారు. సింగిల్ డస్క్ పోర్టల్ లో 26.8.2021 నుండి 22.09.2021 నాటికి 90 దరఖాస్తులు వచ్చాయని 56 దరఖాస్తులను ఆమోదించగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు. 2010-15 & 2015-20 సంవత్సరాలలో ఎం .ఎస్.ఎం .ఇ ఆన్ లైన్ క్లెయింలు 21-9-2021 నాటికి 82 క్లెయింలు రాగా 70 క్లెయింలకు రూ.4,83,46,867/-లకు ఆమోదించడం జరిగిందని, 12క్లెయింలు రిజక్ట్ చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలోఎ.పి.ఐ.ఐ.సి, జి.వి.ఎం.సి., వి.ఎం.ఆర్.డి.ఎ., ట్రాన్స్ కో, ప్యాక్టరీలు, పొల్యూషన్, ఫైర్, తదితర శాఖల అధికారులు, కమిటీ మెంబర్లు హాజరైయారు .