COLLECTORATE

కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలందించేందుకు సన్నద్దం కావాలి

• జిల్లాలో ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలందించేందుకు సన్నద్దం కావాలి
• ప్రతి ఆసుపత్రిలో ‘ హెల్ప్డెస్క్’ తప్పనిసరి
• అవసరమైన మందులు, కోవిడ్ మెటీరియల్ సిద్దంగా ఉంచుకోవాలి
• 24/7 సేవలకు ఆసుపత్రులన్ని సిద్దం కావాలి
జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్
భారత్ వాయిస్, విశాఖపట్నం, ఏప్రిల్ 7: జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లకు వైద్య అందించడానికి పూర్తి స్థాయిలో సిద్దం కావాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు ఈ విషయంపై జాయింట్ కలెక్టరు–2 పి. అరుణ్ బాబు, పలువురు వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు విమ్స్, కె జి హెచ్, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి, అనకాపల్లి, పాడేరు, జిల్లా ఆసుపత్రులు, నర్సీపట్నం, అరుకు ప్రాంతీయ ఆసుపత్రులలో ప్రత్యేక డాక్టర్లు, ఎం.బి.బి.ఎస్. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, శానిటరీ వర్కర్లు, ఇతర సిబ్బంది, అందుబాటులో ఉన్న బెడ్స్, మందులు, కోవిడ్ మెటీరియల్ స్టాకు, అంబులెన్సులు, ఆక్సిజన్ సరఫరా, పేషెంట్లుకు ఆహారము, హెల్ప్ డెస్క్ ఏర్పాటు, ల్యాబ్ టెస్టులు, ఆసుపత్రులకు నిరంతర విధ్యుత్తు సరఫరా, తదితర అంశాలపై ఆసుపత్రుల వారీగా వైద్యాధికారులతో సమీక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు (24/7) పేషెంట్లుకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి లోటు పాట్లను సహించేది లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రులలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకుని ఉండాలన్నారు. జిల్లా ఆసుపత్రుల కో–ఆర్టినేటరు, డా.లక్షణరావు అన్ని ఆసుపత్రులకు సత్వరమే వెళ్లి, పై విషయాలపై పరిశీలించి వివరాలను తెలియ జేయాలని ఆదేశించారు. ఆసుపత్రులలో శానిటేషన్ విషయంపై శ్రద్దవహించాలన్నారు. పేషెంట్లుకు మంచి ఆహారము అందించాలని, ఈ విషయంలో జాయింట్ కలెక్టరు–2 పి.అరుణ్ బాబు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ ఆసుపత్రిలో కూడా సమస్యలతో పేషెంట్లు ఇక్కట్లకు గురికాకుండా, ముందుగానే ప్రణాళికతో 24/7 వైద్య సేవలు అందించడానికి గాను డాక్టర్లు, ఇతర సిబ్బందికి తగు సూచనలు జారీ చేసి అవసరమైన ఏర్పాట్లు చేసుకో్వాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, పేషెంట్లు బంధువులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. కె జి హెచ్ లో కోవిడ్ పేషెంట్లు, ఇతర పేషెంట్లు కూడా చికిత్స కోసం వస్తారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉండాలని కె జి హెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఛాతీ ఆసుపత్రికి అంబులెన్స్ ఏర్పాటు గావించాలని 108 కో ఆర్డినేటరును ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆంధ్రామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, కె జి హెచ్ సూపరింటెండెంటు డా. మైథిలి, విమ్స్ డైరక్టరు డా. కె. సత్య వరప్రసాద్, అనకాపల్లి, నర్సీపట్నం, అరకు, పాడేరు వైద్య విధానపరిషత్ వైధ్యాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి డా. పి. సూర్యనారాయణ, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి పర్యవేక్షలు, తదితరులు పాల్గొన్నారు.