భారత్ వాయిస్ : మావోయిస్ట్ దళంలో పెద్ద కుదుపు. అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తుది శ్వాసవిడిచారు. పోలీసుల హిట్‌లిస్ట్‌లో ఉన్నా ఆర్కే కన్నుమూసినట్లు ఛత్తీస్‌ఘడ్ డీజీపీ తెలిపారు. గత కొంత కాలంగా కారొనతో ఆయన పోరాటం చేస్తున్నారనీ, తుదకు తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆర్ కే మృతిని పోలీసులు ప్రకటిస్తున్నారు తప్ప మావోయిస్ట్స్ నుంచి ప్రకటన లేకపోవడం గమనార్హం. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందారాయన. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతున్నారు. ఆయన కరోనాతో మృతి చెందినట్లు, అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు అధికారులు పోలీసులు ప్రకటించారు. ఆయన తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది.