endowment

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నరసంహస్వామి కళ్యాణోత్సవం 23-04-21న

  • 516 రూపాయలు 23వ తేదీ అర్థరాత్రిలోగా పంపించినవారికి – కళ్యాణోత్సవ తలంబ్రాలు , ప్రసాదం పంపించబడును.
  • దేవస్థానం కార్య నిర్వాహక అధికారి సూర్యకళ

      భారత్ వాయిస్, సింహాచలం (విశాఖపట్నం) :
శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నరసంహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవం 23-04-21న అనగా శుక్రవారం జరుగును. కోవిడ్ -19 కరోనా ప్రభావం వల్ల – స్వామి భక్తులకు తలంబ్రాలు, ప్రసాదం పోస్టుద్వారా అందివ్వాలని ఆలయ EO గారు నిర్ణయించడమైనది. ఈ విధంగా స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు భాగస్వాములు కావచ్చు. ఇందుకోసం 516 రూపాయలు 23వ తేదీ అర్థరాత్రిలోగా పంపించినవారికి – కళ్యాణోత్సవ తలంబ్రాలు , ప్రసాదం పంపించబడును. రూ. 516 రూపాయలు UPI ID:9491000635@SBI ద్వారాగాని లేదా ఆన్ లైన్ SBI account number : 11257208642, IFSC code :SBIN0009795 కు గానీ భక్తులు పంపించొచ్చు. పైన పేర్కొన్న అమౌంట్ పంపించాక – మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ను 6303800736కు వాట్సప్ చేయవచ్చు. ఏమైనా ఇతర వివరాలు కావాలంటే ఇదే నంబర్ కు కాంటాక్ట్ చేయవచ్చు. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీస్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి. విరాళాలుకూడా పంపించవచ్చు.