endowment

సింహాచలం దేవస్థానంలో కోవిద్ నియంత్రణ ఏర్పాట్లు

భక్తులకు ఆందుబాట్లో శానిటైజర్స్ బాక్సలు
మాస్కులు పెట్టుకొని రావాలని ఈవో విజ్ఞప్తి

(భారత్ వాయిస్, విశాఖపట్నం )
సింహాద్రి నాధుని దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా మహమ్మారి భారీన పడకుండా ఉండటానికి దేవస్థానం కార్య నిర్వాహక అధికారి సూర్యకళ పలు భద్రతా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా శానిటైజర్స్ పెద్ద మొత్తంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. దేవస్థానం లో పని చేసే ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కలను ధరించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆదే విధంగా భక్తులు కూడా మాస్క్ పెట్టుకొనే స్వామి వారిని దర్శించుకోడానికి రావాలని కోరారు. దేవస్థానంలో కోవిడ్ ప్రొటోకాల్ పూర్తి స్థాయిలో పాటిస్తున్నారు. భక్తులు ప్రొటోకాల్ పాటిస్తూ… స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నారు. సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో చాలా చోట్ల శానిటైజర్లు పెట్టడం జరిగింది కావున వాటిని భక్తులు ఉపయోగించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భక్తులను ఎండ వేడిమినుంచి ఉపసమనం కోసం టెంట్లు , వైట్ పెయింట్ వేయడం లాంటి చర్యలు తీసుకున్నారు. మాస్కు ధరించడంతోపాటు – భౌతిక దూరం పాటించాలని ఒకటికి పది సార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవస్థానానికి కోవిద్ కారణంగా రాలేని భక్తులు అధికారులు ఏర్పాటు చేసిన ఈ – హుండీ ద్వారా విరాళాలు పంపాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.