endowment

సింహాచలం దేవస్థానంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

(భారత్ వాయిస్, విశాఖపట్నం )

శ్రీ వరాహ నరసింహ స్వామి కొలువై వున్న విశాఖ జిల్లా , సింహాచలం దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్య నిర్వాహక అధికారి సూర్యకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో దేవస్థానం ప్రాంగణాన్ని, గర్భ గుడిలోనూ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం ఆలయ చైర్ పర్సన్ సంచయిత గజపతి హాజరయ్యారు. పంచాంగ శ్రవణం తర్వాత సంచయిత గజపతి, EO సూర్యకళ చేతుల మీదుగా పండితులు, దాతలు , ట్రస్ట్ సభ్యులను సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో
శ్రీనివాస శర్మ గారు , పంచాంగ కర్త
– ఇరగవరపు వెంకట రామానుజాచార్యులు, విశ్రాంత కైంకర్యపరులు
– సత్యచంద్ర సాయి కుమార్ గారు, దాత
– ఎన్ . అప్పారావు గారు , శ్రీహరి సేవాసంఘం
– ఉమా మహేశ్వర రావు గారు , సేవా సంఘం
– సత్తి బాబు గారు, సేవా సంఘంరు
– మాన్సాస్ EO వెంకటేశ్వర రావు గారు తదితరులు వున్నారు.
– ఆలయ ధర్మకర్తలందరికీ సన్మానం సన్మానం చేశారు. కల్యాణ రాట క్కూడా వేశారు. . దేవుని కల్యాణ కార్యక్రమాలన్నీ ఇవాళ్టి నుంచి మొదలవుతాయని కార్య నిర్వాహక అధికారి సూర్యకళ తెలిపారు. ఉగాది రాజు సాయంత్రం ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.