GVMC VSP

“డయల్ యువర్ మేయర్” మరియు “స్పందన” కార్యక్రమములు

భారత్ వాయిస్, విశాఖపట్నం, అక్టోబర్-11:- డయల్ యువర్ మేయర్ కార్యక్రమంనకు 36 ఫోన్ కాల్స్, స్పందనలో 35 ఫిర్యాదులు వచ్చాయని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. సోమవారం ఆమె జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనతో కలసి సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01గంట వరకు “స్పందన” కార్యక్రమం నిర్వహించారు. డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో ఒకటవ (భీమిలి) జోనుకు 03, రెండవ జోనుకు 03, మూడవ జోనుకు 04, నాలుగవ జోనుకు 03, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 13, ఏడవ (అనకాపల్లి) జోనుకు 02, ఎనిమిదవ జోనుకు 03, యు.సి.డి. విభాగమునకు 01, మొత్తము 36 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. “స్పందన” కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా స్వీకరించిన ఫిర్యాదులు రెండవ జోనుకు 04, మూడవ జోనుకు 08, నాలుగవ జోనుకు 04, అయిదవ జోనుకు 07, ఆరవ జోనుకు 05, ఎనిమిదవ జోనుకు 07, మొత్తము 35 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, ఎ.డి.హెచ్. ఎం.దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, గణేష్ బాబు, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.