GVMC VSP

నగర ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా జాగ్రత్తలు పాటించండి

విశాఖపట్నం, ఏప్రిల్-19:- జివిఎంసి పరిధిలో కరోనా వైరస్ చాల ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జివిఎంసి పరిధిలోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మరియు కమిషనర్ డా. జి. సృజన పిలుపునిచ్చారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, చేతులను శుభ్రంగా కడుగుకోవాలని లేదా శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. ప్రజలను బహిరంగంగా గుమిగూడిన ప్రదేశాలలో తిరగవద్దని, అవసరమైతేనే ఇంటినుండి జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని, పండుగలు, శుభకార్యక్రమాలు వంటివి వారి ఇంటి వద్ద మాత్రమే జరుపుకోవాలని, 60 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరూ ఇంటివద్దనే ఉండాలని, విధ్యార్దినీ విద్యార్ధులు పాఠశాలలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఏ మాత్రం కనపడినా, వెంటనే అర్బన్ హెల్త్ కేంద్రాలలో పరీక్షలు చేయించుకోవాలని నగర ప్రజలకు ఇరువురూ విజ్ఞప్తి చేసారు.