GVMC VSP

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
భారత్ వాయిస్ :విశాఖపట్నం, సెప్టంబర్-23:- పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. గురువారం 5వ జోన్ 44వ వార్డు పరిధిలో షాదీఖానా కల్యాణ మండపంలో ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా, ఫ్లోర్ లీడర్ బాణాల సత్య సూర్య శ్రీనివాస రావు తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. గర్భిణీలు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే తల్లిబిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు పౌష్టిక విలువలతో కూడిన ఆహారమైన చిరుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, గుడ్లు మొదలైనవి తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ, ఐసిడిఎస్ సి.డి.పి.ఒ. శ్రీలత, సూపర్వైజర్లు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.