GVMC VSP

స్థాయి సంఘంలో పలు అంశాలకు ఆమోదం

భారత్ వాయిస్, విశాఖపట్నం, అక్టోబర్-14:- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం గురువారం స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జరిగింది. స్టాండింగ్ కమిటీ అజెండాలో మొత్తం 20 అంశాలు పొందుపరిచారు. టేబుల్ అజందాగా రెండు అంశాలు ఉన్నాయని తెలిపారు. టేబుల్ అజెండాలోని 10, 11 వార్డులకు సంబందించిన కాలువలు, రోడ్లు నిర్మించుటకు రెండు అంశాలను ఆమోదించడమైనదని, 20 అంశాలలో 3వ అంశము రెవెన్యూ విభాగమునకు సంబందించిన లారీల ఆశీలు వసూలు విషయమై వాయుదా వేయడమైనదని, అజెందాలోని 10, 11, 12 అంశాలు పూర్తి వివరాలతో లేనందున ఆ అంశాలను రద్దు చేయడమైనదని స్థాయి సంఘ చైర్ పర్సన్ తెలిపారు. ఈ సమావేశంలో స్థాయి సంఘ సభ్యులు, డి.సి.(రెవెన్యూ) పి. నల్లనయ్య, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్. రవి, కార్యనిర్వాహక ఇంజినీర్లు ప్రసాద్ బాబు, రాయల్ బాబు, శ్రీనివాస్, కార్యదర్శి లావణ్య, జోనల్ కమిషనర్ శివప్రాసాద్, డి.ఇ.ఒ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.