GVMC VSP

46వ వార్డులో క్లాప్ ప్రోగ్రాంను పరిశీలించిన జివిఎంసి కమిషనర్

విశాఖపట్నం, ఏప్రిల్-19:- మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని ఐదవ జోన్ పరిధి 46వ వార్డులో సంజీవయ్య కొలనీ ప్రాంతాలలో క్లాప్(CLAP) ప్రోగ్రాం అమలు జరుగుతున్న తీరుతెన్నులను సోమవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రాంతంలో కాలువల పూడికతీత పనులు, చెత్తను వేరు చేసి గృహాల నుండి సేకరణ చేయడం మొదలగు విషయాలను ప్రజలతో చర్చించి వారికి కొన్ని సూచనలు చేసారు. ఆ ప్రాంతంలో డంపర్ బిన్ లు తోలగించడం వంటి విషయాలను పారిశుధ్య కార్మికులకు పనులు కేటాయింపు చేసే ప్రణాళిక వివరాలను ఎఎంఓ హెచ్ ని అడిగితెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ, స్వచ్చ సర్వేక్షణ్ అంశాలపై వార్డు శానిటరీ ఇన్స్పెక్టరు, శానిటరీ కార్యదర్శులు కు కొన్ని సూచనలు చేసారు. క్లాప్ పధకం విజయవంతం చేయడానికి అందరి కృషి అవసరమని ఒక ప్రణాళిక ప్రకారం పనులు నిర్వహించాలని ప్రజలలో పారిశుధ్య పనులపై సంతృప్తి కలగాలని ఎఎంఓహెచ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐదవ జోనల్ కమిషనర్ పి. సింహాచలం, ఎఎంఓహెచ్ రాజేష్, ఐదవ జోన్ ఎసిపి, ఇంజినీరింగు అధికారులు, శానిటరీ సూపర్వైజర్,  శానిటరీ ఇన్ స్పెక్టర్, వార్డు కార్యదర్శులు  తదితరులు పాల్గొన్నారు.