GVMC VSP

8వ జోన్ ప్రాంతాలలో కమిషనర్ పర్యటన

విశాఖపట్నం, ఏప్రిల్-20 :- జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఎనిమిదవ జోన్ లో గల 93, 94 వార్డుల ప్రాంతాలైన నాయుడు తోట, సాయినాధ నగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో పారిశుధ్య పనులు నిర్వహించేందుకుగాను తయారు చేసిన ప్రణాళికను, సంబంధిత ఎఎంఓహెచ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాలలో డోర్-టు-డోర్ దగ్గర వేరు చేసి ప్రజల వద్ద నుండి సేకరిస్తున్న తడి-పొడి చెత్త వివరాలను ప్రాంత వాసులను అడిగి తెలుసుకున్నారు. వ్యాపార షాపులను తనిఖీ చేసి, అక్కడ మూడు బిన్ లు ఏర్పాటు చేసినదీ లేనిదీ తెలుసుకున్నారు. షాపుల వద్ద బిన్ లు ఏర్పాటు చేయని వారి వద్ద నుండి జరిమానాలు వసూలు చేయాలని జోనల్ కమిషనర్ ను, ఎఎంఓహెచ్ ను ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం గమనించి, చెత్తను తొలగించి, సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి, అపరాధ రుసుము వసూలు చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. 93వార్డు, 94వార్డు కార్పొరేటర్లు, వారి వార్డులలో గల సమస్యలను, కమిషనర్ దృష్టికి తీసుకు రాగా, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనా కార్యక్రమాలు జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి త్రివేణి వర ప్రసాదరావు, 94వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాస రావు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.