COLLECTORATEMUINCIPALITY

వాలంటీర్లు సెల్ ఫోన్లను అప్పగించాలి : జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్

( భారత్ వాయిస్ , విశాఖపట్నం )
జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటలలో పనిచేస్తున్న వాలంటీర్లు తమ అధికారిక సెల్ ఫోన్ లను తక్షణం అప్పగించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ వి.వినయ్ చంద్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ‘వాలంటీర్లు సెల్ ఫోన్ లను అప్పగించాలని’ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. మున్సిపాలిటీ కార్యాలయంలో పాలనాధికారి /మేనేజర్ /సంబంధిత అధికారికి తక్షణం తమ సెల్ ఫోన్ లను అప్పగించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ చేయాల్సి వస్తే మున్సిపల్ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారి అనుమతితో అధికారి సమక్షం నుండి ఫోన్ చేయవచ్చని ఆయన చెప్పారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మేరకు వాలంటీర్లు ఎటువంటి అనధికారక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆయన స్పష్టం చేశారు. అనధికారక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందితే వారిపై విచారణ చేసి నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. అనధికార కార్యకలాపాల్లో పాల్గొనే వాలంటీర్ల పై చర్యలు చేపట్టవచ్చని డివిజన్ బెంచ్ స్పష్టంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు.
వాలంటీర్ల పై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ : అనధికారిక కార్యకలాపాల్లో పాల్గొనే వాలంటీర్ల పై ఫిర్యాదులను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 0891 2590100 ; మెయిల్ ఐడి:drovskccc@gmail.com లకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు అందిన 12 గంటల లోగా విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తీవ్ర ఆక్షేపణలు వచ్చిన వాలంటీర్ల పై ఆరోపణలు రుజువైతే డివిజన్ బెంచ్ ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
మున్సిపాలిటిల వారీగా కంట్రోల్ రూమ్ లు :
జి.వి.యం.సి : 1800 425 00009
0891 – 2869122 , 2869123
నర్సీపట్నం : 84650 13255; 08932 295588
యలమంచిలి : 08931-231057; 9701451548; 8247064177