Uncategorizedవార్తలు

ఆర్ కార్డు లతో వ్యాపారం చేశారు.

విశాఖ ఉక్కు లేకపోతే మన అస్తిత్వం కోల్పోతాం.
యుపిఎస్సి పూర్వ ఛైర్మన్.
ఆచార్య కె యస్.చలం.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం భూమి ఇచ్చి నష్టపోయిన రైతుల కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగిందని యుపీపీఎస్సీ మాజీ చైర్మన్ ఆచార్య కె యస్ చలం అన్నారు. వారి ఆర్ కార్డులను కూడా అమ్ముకొని అమాయకులైన ప్రజలను మోసం చేసి ఆర్ కార్డు లతో వ్యాపారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉత్తరాంధ్ర అస్తిత్వ సమస్య అంటే మన ఉనికి వేగంగా ముందు కొస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ కు భుము లిచ్చిన స్థానికుల అమాయకత్వం, ఆకలితో ఆర్ కార్డులు అమ్ముకునేట్లు చేశారు. ఆవిధంగా చాలా మంది మిగతా జిల్లాల వారు యిక్కడకు చేరారు. 1990 నాటికి మన వారి ఆర్థిక , విద్యా పరిస్థితి బాగో లేవన్నారు. స్టీల్ ప్లాంట్ కాదు మిగతా సంస్థల్లో క్లాస్ 4 ఉద్యోగాలు దొరికి తే చేరారు. పొట్ట చేత్తో పట్టుకొని వైజాగ్ చేరుకున్న కుటుంబాలు యింటి పని, తాపీ పనిలో కుదురుకుని గాలి పీల్చుకుంటూ బ్రతికేస్తూ ప్రభుత్వ మిచ్చే బియ్యం సహాయాలు చూసి చాల్లే అనుకుంటున్నారు. దీనితో రెచ్చి పోతున్న మిగతా ప్రాంతాల నాయకులు స్థానికులకు తాయిలాలు యిచ్చి తాబేదార్ల గా చెరదీస్తున్నారన్నారు. వారికి జీ హుజూర్ అని కల్మొక్కించుకుని అవమానకరంగా చూస్తున్నారు. స్థానిక భాష, సంస్కృతి ని హేళన చేస్తూన్నారు. చివరకు ప్రజల ఆస్తులు, స్టీల్ ప్లాంట్ తో సహా సముద్ర తూర్పు తీరాన్ని ,అరకు వరకు కొండల్ని చుట్టేయడానికి ప్రణాళికలు జరిగిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి అని అన్నారు. యిక్కడ రాజకీయ పార్టీలకతీతంగా అంతా అక్కడి వారే .యిప్పుడు స్టీల్ ప్లాంట్ తో పాటు మన స్థిరాస్తు లను ,భూములను కాపాడు కోవాలి .అందుకు యువకులు కాసేపు మొబైల్ పక్కన పెట్టి భవిష్యత్ ఆలోచించండని హితవు పలికారు.పదేళ్ల తరువాత తుర్పోల్లు అంటే మనల్ని తన్ని కూర్చో బెడతారు. మన మాటను, పాటను, తిండిని మన యింట్లోనే వెలాకొళం చేసి మధ్య యుగాలకు పంపిస్తారు. యిప్పుడు నడుస్తున్న చరిత్ర కప్పం కట్టే సామంతుల కోసం వెతుకులాట. స్థానికుడు పక్క ప్రాంతం వాడికి ,రాష్ట్రం కేంద్రానికి ఎంత కప్పం కట్టే పరిస్థితి ఏర్పడింది. ఎంత భూమి పెట్టుబడి యిస్తుంది అనే రాజకీయ ఆటలో ఉత్తరాంధ్ర వాళ్ళు సిద్ధాంతాల ఏకరువు ఎంత వరకు ఉపయోగ పడుతుంది. వాటినన్నింటిని దాటి వచ్చారు సెటిలర్స్ .బహుపరాక్ ఆలోచించు …ఆచరించు ముందుకు అడుగేయాలని ఆయన పిలుపునిచ్చారు.